ఆచార్య చాణిక్యుడు చాలా గొప్ప మేధావి. ఆయన మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను నీతి శాస్త్రం ద్వారా బోధించారు. అలాంటి చాణిక్యుడు బోధనలు నేటికి చాలామంది అనుసరిస్తున్నారు. చాణిక్యుడు తన ఆలోచనతో చంద్రగుప్తున్ని రాజుగా కూడా చేశారు. అర్థశాస్త్రం లాంటి మహాగ్రంధం రచించడం ద్వారా కౌటిల్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మనిషి సంతోషంగా జీవితంలో ఎదగాలంటే ఇలా ఉండాలి అనే విషయాలను చెప్పాడు. ఇక ఆచార్య చాణిక్యుడు మహిళల గురించి అనేక విషయాలను తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
also read:సమంత పోస్ట్ కు స్పందించిన కోహ్లీ భార్య…ఇంట్రెస్టింగ్ రిప్లై ఇవ్వడంతో వైరల్..!
Advertisement
ధైర్యం ఎక్కువ:
పురుషులకంటే స్త్రీలే ధైర్యం కలవారు. కొన్ని విషయాల్లో అంటే..బొద్దింకలు వీధి కుక్కలు, చీకట్లో నడవడం వంటి వాటికీ భయపడతారు. కానీ ఏదైనా కఠిన నిర్ణయం తీసుకోవాలి అంటే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ధైర్యం చేస్తారు. వీరు మానసికంగా కూడా పురుషులకంటే ధైర్యవంతులు.
కోరికలు ఎక్కువ:
Advertisement
శారీరకంగానే కాకుండా కొన్ని విషయాలలో స్త్రీలకు కోరికలు ఎక్కువగా ఉంటాయట. ముఖ్యంగా శారీరక కోరికల విషయంలో పురుషులు త్వరగా ఉద్వేగానికి లోనవుతారు. అంతే స్పీడుగా తగ్గిపోతారు. కానీ స్త్రీలు ఉద్వేగానికి రావడానికి టైం తీసుకుంటారు. సంతృప్తిని ఎక్కువసేపు ఆస్వాదిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలకు ఆ విషయాల్లో కూడా కోరిక ఎక్కువగా ఉంటుంది.
also read:RRR Oscar award 2023: ఆస్కార్ అందుకున్న RRR.. రికార్డు క్రియేట్ చేసిన “నాటు నాటు”..!!
ఆకలి ఎక్కువ:
ముఖ్యంగా పురుషుల కంటే స్త్రీలు శారీరక శ్రమ ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి ఆకలి కూడా ఎక్కువగా ఉంటుందని ఆచార్య చాణిక్యుడు తెలియజేశారు.
also read:Sr. NTR-వెంకటేష్ చేయాలనుకున్న మల్టీస్టారర్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?