ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికే చాలా మంది అనుసరిస్తున్నారు. ఒక మనిషి ఎటువంటి మార్గంలోకి వెళ్లాలి, ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి. అదేవిధంగా ఓ వ్యక్తి జీవితంలో పాటించాల్సిన పలు నియమాలను ఈ నీతి శాస్త్రంలో ప్రస్తావించారు. వీటిని పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు. ముఖ్యంగా ఆచార్య చాణక్య నీతి ప్రకారం.. ఇలాంటి వియాలకు చాలా దూరంగా ఉండాలట. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అహంకారం మనిషికి ఉండకూడదు. అలాంటి వారు ఎప్పుడు జీవితంలో ఎదుగలేరు. ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటారు. వారి అహంకారం వల్ల ప్రతిదీ కోల్పోతారు. అహం ఒక వ్యక్తిని సత్యానికి దూరంగా ఉంచుతుంది. అందుకే తనను తాను అర్థం చేసుకోలేడు. వీరి అహం కారణంగా భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోపాన్ని వీడినప్పుడే జీవితం సుఖమయం అవుతుంది. అదేవిధంగా సోమరితనం ఒక వ్యక్తి యొక్క ప్రతిభను నాశనం చేస్తుంది. సోమరితనం మూలంగా అనేక అవకాశాలను కోల్పోతాడు. సోమరితనం తన లక్ష్యానికి దూరం చేస్తుంది. ఇలాంటి వారు జీవితంలో ఏమి సాధించలేరు.
Advertisement
Advertisement
ఒక వ్యక్తికి కోపం అనేది తనకు తానే శత్రువు. మనిషి కోపంతో తనపై తాను నియంత్రణ కోల్పోతాడు. అలాంటి వారు ఎప్పటికీ గౌరవం పొందలేరు. ప్రతి ఒక్కరూ కోపంగా ఉన్న వారికి దూరమవుతారు. అందుకే సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకోవడం బెటర్. చాణక్యుడు చెప్పిన ప్రకారం.. ఏ మనిషి గొప్పలకు పోయి అతిగా ప్రవర్తించవద్దు. సాధారణంగానే మనిషి ఎన్నో రకాల అబద్దాలను చెబుతాడు. ఎదుటివ్యక్తి ముందు తానే గొప్ప అని నిరూపించుకోవడం కోసం అనేక కబుర్లు చెబుతుంటారు. ఇది చివరికి ఇబ్బంది పాలు చేస్తుంది.
Also Read :
Vidura Niti : ఒక వ్యక్తిలో ఈ 8 గుణాలు ఉంటే చాలు.. అందరిచే గౌరవించబడతారట..!