ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రాన్ని చాలా మంది ఆచరిస్తుంటారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎటువంటి మార్గంలో పయణించాలి, ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి తదితర విషయాలపై చాణక్య నీతిశాస్త్రంలో సవివరంగా వివరించారు.
Advertisement
వీటిని పాటిస్తే తప్పకుండా జీవితంలో విజయాన్ని సాధించవచ్చని చెప్పారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడానికి వచ్చే కొన్ని సంకేతాల గురించి చాణక్య ప్రస్తావించారు. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి : చాణక్య నీతి: ఇలాంటి అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోకూడదు..!!
ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం.. ఇంట్లో తరచూ గొడవలు జరగడం అసలు మంచిది కాదు. గొడవలు జరిగితే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదట. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కుటుంబీకులు ఎటువంటి గొడవలు రాకుండా హాయిగా, సంతోషంగా గడపాలి. గాజు పగలడం చాలా అశుభం. ఇంట్లో పదే పదే గాజు పగిలిపోతే ఆ ఇంటి సభ్యులను ఆర్థిక సమస్యలు చుట్టూ ముడుతాయని అర్థం. అందువల్ల గాజు పగలడం ఆర్థిక సమస్యలను సూచిస్తుందట. ఇంట్లో గాజు పగలకుండా చూసుకోవాలి.
Advertisement
ఇవి కూడా చదవండి : ఆ స్టార్ హీరోతో మళ్లీ ప్రేమలో పడిన హన్సిక.. పెళ్లి చేసుకుంటుందా..?
ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం.. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా పూజలు కూడా నిర్వహించాలి. దీంతో ఇంట్లో లక్ష్మీదేవి నివాసముంటుంది. పూజలు చేయని ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదు. ప్రతి రోజు పూజ చేయడం మంచిది. మన ఇంట్లో తులసి మొక్క ఎండిపోవడం డబ్బు కొరతను సూచిస్తుంది. ఇక భవిష్యత్‌లో రాబోయే ఇబ్బందులకు సంకేతం కూడా కావచ్చు. తులసి మొక్క ఎండిపోవడం ప్రారంభమయితే రాబోయే కాలంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తులసి చెట్టు ఎల్లప్పుడూ పచ్చగా ఉండేవిధంగా చూసుకోవాలి.
ఇవి కూడా చదవండి : Chanakya Niti : తెలివైన వ్యక్తుల్లో ఈ అలవాట్లు తప్పకుండా ఉంటాయి..!