ఆచార్య చాణిక్యుడు అంటేనే గొప్ప రాజనీతి శాస్త్రజ్ఞుడు. గొప్ప వ్యూహకర్త. ఆయన మానవ జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సలహాలు సూచనలు జీవితంలో విజయం సాధించడానికి ఉపయోగపడతాయి. చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో భార్యాభర్తల గురించి అనేక విషయాలు చెప్పారు.. ఈ సమయంలో భర్తలకు కొన్ని సూచనలు చేశాడు. కొన్ని విషయాలు భర్త భార్యతో అస్సలు పంచుకోవద్దని అన్నారు. మరి ఆ విషయాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందామా..
జీతభత్యాలు: ముఖ్యంగా ప్రతి భర్త ఎంత సంపాదిస్తున్నాడు అనే విషయం భార్యకు తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది. కానీ భర్త జీతం గురించి భార్యకు పూర్తిగా చెప్పకూడదని చాణిక్యుడు అంటున్నారు. ఎందుకంటే భర్త జీతం పెరిగితే భార్య ఖర్చులు కూడా పెరుగుతాయని అంటున్నారు. అందుకే జీతాన్ని తక్కువగా చేసి చెప్పాలని, మిగిలిన మొత్తాన్ని పొదుపు చేసుకోవడం, పెట్టుబడి పెట్టడం లాంటివి చేయాలని అంటున్నాడు.
Advertisement
also read:నటనకు బ్రాండ్ అంబాసిడర్.. గుర్తు పట్టలేని అవతారం !
Advertisement
also read:రవితేజ రావణాసుర ఓటీటీలోకి వచ్చేది అప్పుడే ?
ఈ నిజాలు చెప్పొద్దు :
ముఖ్యంగా మీరు ఏవైనా దానధర్మాలు, విరాళాలు అందిస్తే అది మీ భార్యకు ఇష్టం ఉంటే చెప్పండి . ఒకవేళ ఆమెకి ఇలాంటి పనులు చేయడం ఇష్టం లేదని మీకు అనిపించినట్టయితే ఈ విషయాలు మీ మనసులోనే దాచుకోండి . ఈ విషయాలు ఆమెతో పంచుకోవడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల మీరు అనవసరంగా ఖర్చు చేస్తున్నారు అంటూ మిమ్మల్ని నిలదీస్తుంది.
బలహీనతలు :
భర్త తన భార్యకు ఆయనకు సంబంధించిన బలహీనతలను అస్సలు చెప్పకూడదని అంటున్నారు ఆచార్య చాణిక్యుడు. మీ బలహీనతలు భార్య చెప్పడం వల్ల ఆమె దగ్గర మీరు చులకన అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. మీకేమైనా బలహీనతలు ఉంటే సోదరీ, తల్లి, స్నేహితుడికి చెప్పుకోవాలని తెలియజేస్తున్నారు చాణిక్యుడు.
also read:అవినాష్ రెడ్డి, సిఎం జగన్ తో నాకు ప్రాణహాని ఉంది – దస్తగిరి సంచలనం