Home » చాణ‌క్య‌నీతి : మ‌నిషిని న‌మ్మేముందు ఈ నాలుగు విష‌యాలు ప‌రిశీలించండి..!

చాణ‌క్య‌నీతి : మ‌నిషిని న‌మ్మేముందు ఈ నాలుగు విష‌యాలు ప‌రిశీలించండి..!

by AJAY
Published: Last Updated on
Ad

జీవితంలో ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొవాలంటే చాణ‌క్యుడి నీతి తెలిసి ఉండాలి. చాణ‌క్యుడు అప్ప‌ట్లో జీవితం గురించి రాసిన విష‌యాలు కూడా ఇప్ప‌టికీ స‌మాజంలో బ్ర‌తికేందుకు అవ‌స‌ర‌మ‌వుతాయంటే అత‌డి మేధ‌స్సు ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. చాణ‌క్యుడు నీతి శాస్త్రాన్ని ర‌చించారు.

chanakya nithi

chanakya nithi

ఈ శాస్త్రం ద్వారా జీవితంలో సంతోషంగా ఎలా జీవించాలో ర‌హ‌స్యాల‌ను చెప్పారు. ప్ర‌తి అంశానికి సంబంధించిన విష‌యాల‌ను ఈ శాస్త్రంలో చాణ‌క్యుడు చ‌ర్చించాడు. ఇక ఈ శాస్త్రంలో మ‌న ఎదుట ఉన్న వ్య‌క్తిని అంచనా వేయ‌డానికి ఆయ‌న నాలుగు సూత్రాల‌ను చెప్పారు. ఆ సూత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

Advertisement

Also Read: ప్ర‌క‌ట‌న చేసి విడుద‌ల కాలేని మ‌హేష్ బాబు సినిమాలు ఇవే

Advertisement

ప‌రిత్యాగ స్పూర్తిని చూడ‌డం :
ఎదుటివారిలో ఎంత త్యాగ గుణం ఉందో చూడటం. ఎదుటి వారి సంతోషం కోసం ఎంత‌టి త్యాగానికైనా సిద్ద‌మైతే ఇత‌రుల బాధ‌ల‌ను అర్థం చేసుకోగ‌లిగే సామ‌ర్థ్యం ఉంటే అలాంటి వ్య‌క్తిని న‌మ్మ‌ద‌గిన వ్య‌క్తి అనొచ్చు.

చ‌రిత్ర :
ముక్య‌మైన అంశం చ‌రిత్ర‌. చరిత్ర భాగాలేని వాడి ఇంట్లో కూర్చోవ‌డం కూడా యోగ్యుడి ల‌క్షణం కాదు. చ‌రిత్ర స‌రిగా లేని వారిపై ఆధార‌ప‌డ‌టం ప్రాణాంత‌కం…కాబ‌ట్టి చ‌రిత్ర తెలిసిన త‌ర‌వాత‌నే న‌మ్మాలి.

ల‌క్ష‌ణాలు ప‌రీక్షించడం :
ల‌క్ష‌ణాలు చూడాలి. కోపం, సోమ‌రితనం, అసూయ‌, అహంకారం, అబ‌ద్దాలు చెప్ప‌డం అలవాటు ఉన్న వ్య‌క్తులను న‌మ్మ‌కూడ‌దు. ప్ర‌శాంతంగా…గంభీరంగా ఉండి సత్యం ప‌లికేవారిని మాత్రమే న‌మ్మాలి.

క‌ర్మ‌ :
మ‌త‌మార్గం ను అనుస‌రించి ఇత‌రుల‌కు సాయం చేయ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించేవారిని విశ్వ‌సించ‌వచ్చు. కానీ త‌ప్పుడు మార్గంలో డ‌బ్బులు సంపాదించేవాడ్ని న‌మ్మ‌కూడ‌దు.

Also Read: నాగ చైతన్య తో విడాకులు : ట్రోలింగ్ పై సమంత కామెంట్ !

Visitors Are Also Reading