Home » ప్ర‌క‌ట‌న చేసి విడుద‌ల కాలేని మ‌హేష్ బాబు సినిమాలు ఇవే

ప్ర‌క‌ట‌న చేసి విడుద‌ల కాలేని మ‌హేష్ బాబు సినిమాలు ఇవే

by Bunty
Ad

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు క‌థ ల‌ను ఒక‌టి కి నాలుగు సార్లు ఆలోచించి.. నిర్ణ‌యం తీసుకుని సినిమాల ను చేస్తారు. అలా చేస్తారు కాబ‌ట్టే ఆయ‌న చాలా సినిమా లు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. పోక‌రి, మ‌హ‌ర్షి తో పాటు ప‌లు సినిమా లు అల్ టైమ్ హిట్ గా నిలిచాయి. అయితే ప్రిన్స్ మ‌హేష్ బాబు క‌థ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి.. ప్ర‌కటన చేసినా.. విడుదల కాని సినిమా సంఖ్య పెద్ద గా నే ఉంది. ఇప్పుడు ఆ సినిమా ల‌ను వాటి వివ‌రాలను తెలుసుకుందాం.

Advertisement

మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో హ‌రే రామ హ‌రే కృష్ణ అనే సినిమా ను ప్ర‌క‌టించారు. దీనికి యం ఎస్ రాజు నిర్మాత గా కూడా ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌కుండానే ఆగిపోయింది. అలాగే శివ‌మ్ అనే పేరుతో మ‌హేష్ బాబు హీరో గా క్రిష్ ద‌ర్శ‌కుడి గా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా సోనాక్షి సిన్షా ను హీరోయిన్ గా కూడా కన్ఫామ్ చేశారు. అయితే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. అలాగే మ‌ణిర‌త్నం మ‌హేష్ విక్ర‌మ్ కాంబినేష‌న్ లో కూడా ఒక ప్రాజెక్ట్ ను ప్ర‌క‌టించారు. కానీ అది కార్య రూపం దాల్చ‌లేదు.

Advertisement


దుర్డా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై హేమాంద‌ర్ డైరెక్ష‌న్ లో మిర్చి అనే సినిమా ను ప్ర‌క‌టించారు. అయితే ఇది కూడా కార్య‌రూపం దాల్చ‌లేదు. సూరెంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం లో మిస్ట‌ర్ ఫ‌ర్ ఫెక్ట్ కూడా ప్ర‌క‌టించారు. ఇది కూడా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. వినాయక్ తో కూడా ఒక సినిమా ప్ర‌క‌టించాడు. అది కూడా రాలేదు. అలాగే జ‌న‌గ‌ణ‌మ‌న అని పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం లో ప్ర‌క‌టించారు. ఇది కూడా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఇంకా చాలా సినిమా లు ప్ర‌క‌టించారు. కానీ అవి సెట్స్ పైకి వెళ్ల‌లేవు.

Visitors Are Also Reading