జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవాలంటే చాణక్యుడి నీతి తెలిసి ఉండాలి. చాణక్యుడు అప్పట్లో జీవితం గురించి రాసిన విషయాలు కూడా ఇప్పటికీ సమాజంలో బ్రతికేందుకు అవసరమవుతాయంటే అతడి మేధస్సు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. చాణక్యుడు నీతి శాస్త్రాన్ని రచించారు.
ఈ శాస్త్రం ద్వారా జీవితంలో సంతోషంగా ఎలా జీవించాలో రహస్యాలను చెప్పారు. ప్రతి అంశానికి సంబంధించిన విషయాలను ఈ శాస్త్రంలో చాణక్యుడు చర్చించాడు. ఇక ఈ శాస్త్రంలో మన ఎదుట ఉన్న వ్యక్తిని అంచనా వేయడానికి ఆయన నాలుగు సూత్రాలను చెప్పారు. ఆ సూత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
Advertisement
Also Read: ప్రకటన చేసి విడుదల కాలేని మహేష్ బాబు సినిమాలు ఇవే
Advertisement
పరిత్యాగ స్పూర్తిని చూడడం :
ఎదుటివారిలో ఎంత త్యాగ గుణం ఉందో చూడటం. ఎదుటి వారి సంతోషం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దమైతే ఇతరుల బాధలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉంటే అలాంటి వ్యక్తిని నమ్మదగిన వ్యక్తి అనొచ్చు.
చరిత్ర :
ముక్యమైన అంశం చరిత్ర. చరిత్ర భాగాలేని వాడి ఇంట్లో కూర్చోవడం కూడా యోగ్యుడి లక్షణం కాదు. చరిత్ర సరిగా లేని వారిపై ఆధారపడటం ప్రాణాంతకం…కాబట్టి చరిత్ర తెలిసిన తరవాతనే నమ్మాలి.
లక్షణాలు పరీక్షించడం :
లక్షణాలు చూడాలి. కోపం, సోమరితనం, అసూయ, అహంకారం, అబద్దాలు చెప్పడం అలవాటు ఉన్న వ్యక్తులను నమ్మకూడదు. ప్రశాంతంగా…గంభీరంగా ఉండి సత్యం పలికేవారిని మాత్రమే నమ్మాలి.
కర్మ :
మతమార్గం ను అనుసరించి ఇతరులకు సాయం చేయడం ద్వారా డబ్బులు సంపాదించేవారిని విశ్వసించవచ్చు. కానీ తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించేవాడ్ని నమ్మకూడదు.
Also Read: నాగ చైతన్య తో విడాకులు : ట్రోలింగ్ పై సమంత కామెంట్ !