ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ జీవితంపై అనేక విషయాలు చెప్పాడు. ఒక వ్యక్తి యొక్క దోషాలు, విద్యా,వ్యాపారం,కుటుంబం, వివాహానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. జీవితంలో మనం చేయాల్సిన మంచి పనులు, చేయకూడని పనులు తన నీతి శాస్త్రంలో బోధించారు.. వాటిలో ఇది ఒకటి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.. అది ఏంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం చిన్న పిల్లలను నిద్రపోతుంటే వారికి ఆకలి వేస్తుందని లేదా ఎక్కువ సేపు నిద్ర పోతున్నారని బలవంతంగా నిద్ర లేపకూడదట.. ఒకవేళ వారిని నిద్ర లేపితే మళ్ళీ వారిని నిద్రపుచ్చడం చాలా కష్టం.. వారి ఎదుగుదలకు నిద్రే ముఖ్యం కాబట్టి వారు నిద్రపోతుంటే లేపడం మంచిది కాదు. పాలకులు లేదా ఉన్నతాధికారులు నిద్రపోతుంటే వారిని లేపడం వల్ల మనకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఎందుకంటే వారిని బలవంతంగా నిద్ర లేపితే వారి కోపానికి మనం బలి కావాల్సి వస్తుందని చాణిక్యుడు అన్నారు.
Advertisement
అలాగే కొంతమంది మూర్ఖులు కూడా నిద్ర పోతున్నప్పుడు నిద్రలేపి వారి ద్వారా మనం అనవసరం కష్టాలను తెచ్చుకున్నట్టే.. ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు అది చెప్పాలని మూర్ఖులను లేపితే ఆ పని అవ్వక పోగా మీకు కొత్త తలనొప్పులు మొదలవుతాయని చాణిక్యుడు అన్నారు. సింహం నిద్రపోతున్నప్పుడు పొరపాటున కూడా దాని నిద్రకు భంగం కలిగించకూడదు. అలా చేస్తే దాని కోపానికి మీరు బలి కావాల్సి వస్తుందని చాణిక్యడు అన్నారు.
ALSO READ:ఈ ఫొటోలో ఒక స్టార్ హీరో ఉన్నారు.. ఎవరో గుర్తించండి.. ఈ పిక్ తీసింది కూడా మరో స్టార్ హీరో..!!