Home » చిరంజీవి, బాలకృష్ణ, బ్రహ్మానందం,విజయశాంతి మరో 15 మంది సెలబ్రిటీలు ఆ విమాన ప్రమాదంలో చిక్కుకున్నారని తెలుసా..?

చిరంజీవి, బాలకృష్ణ, బ్రహ్మానందం,విజయశాంతి మరో 15 మంది సెలబ్రిటీలు ఆ విమాన ప్రమాదంలో చిక్కుకున్నారని తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా విమానం ఎక్కిన తర్వాత ల్యాండ్ అయ్యే వరకు చాలామంది సేఫ్ గా దిగుతారో లేదో చెప్పలేం. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కాబట్టి విమాన ప్రమాదాలు ముందుగానే అంచనా వేస్తున్నారు. కానీ కొన్ని సంవత్సరాల కింద ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఒక ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉండేది కాదు. అలాంటి ఘటన ఇది కూడా. 1993 నవంబర్ 15న ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం భారీ ప్రమాదానికి గురైంది. కానీ అందులో ఎవరూ చనిపోలేదు. 262 మంది ప్రయాణికుల్లో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఇదే విమానంలో మెగాస్టార్ చిరంజీవి,బాలకృష్ణ, ఎస్ వి కృష్ణారెడ్డి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం వాణిశ్రీ,  విజయశాంతి తో సహా పెద్ద పెద్ద సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఆ సమయంలో చాలా మంది నటులు హైదరాబాద్ నుంచి చెన్నైకి ఎక్కువగా వెళ్లేవారు.

Advertisement

ALSO READ:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త

ఓరోజు ఉదయాన్నే ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం చెన్నై నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. సరిగ్గా తిరుపతి ప్రాంతానికి చేరేసరికి, దట్టమైన పొగ వల్ల ల్యాండింగ్ సమస్యలు వచ్చాయి. పైలెట్ కు సమాచారం అందింది. ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి మళ్లీ విమానాన్ని చెన్నైకి మళ్ళించాలని అనుకున్నాడు. కానీ ఆయన ఒక విషయాన్ని మాత్రం గమనించలేదు.. మళ్లీ వెనక్కి మళ్ళీ కొంత దూరం వెళ్లేసరికి సరిపడేంత ఫ్యూయల్ లేదని గ్రహించాడు. దీంతో విమానంలో గందరగోళం ఏర్పడింది. అందరూ హాహాకారాలు పెడుతున్నారు. టెన్షన్ మొదలైంది. ఏమవుతుందో,ఏం జరుగుతుందో అని భయపడి పోతున్నారు. ఇది మా ఆఖరి రోజు అని భావించి ఉన్నారు. ఎలాగైనా ఫ్యూయల్ సేవు చేయాలని విమానాన్ని లో లెవల్ కీ తీసుకొచ్చారు. వేగాన్ని తగ్గించడం కోసం ఫ్లాబ్స్ ఓపెన్ చేసాడు పైలెట్. అందరూ ఇది ఓపెన్ అయ్యాయి అనుకున్నారు కానీ ఈ సమయంలోనే మరో విమానంలోని ఫ్లాబ్స్ తో లో లెవెల్లో వెళుతుండటం చూసి అలర్ట్ అయ్యారు. ఫాబ్స్ జామైపోయాయి.

Advertisement

ఫ్యూయల్ పూర్తిగా దగ్గరకు వచ్చింది. ఇక ల్యాండింగ్ చేయాలి. ఎక్కడ చేయాలనేది పైలెట్ పైనుంచి చాలా వెతుకుతున్నాడు. అది మొత్తం దట్టమైన అడవి, దీనికి తోడు మంచు ఏమీ కనిపించడం లేదు. చీకటి పడింది. అప్పటికే చాలా తక్కువ ఎత్తు నుంచి విమానం వెళ్తుంది. ఎక్కడ ల్యాండ్ చేద్దామన్నా కష్టంగా మారింది చుట్టూ విద్యుత్ స్తంభాలు, బండ రాళ్ళు, పెద్ద పెద్ద చెట్లు, ఎట్టకేలకు నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలో ఒక ఎండిపోయిన సరస్సు దూరంనుంచి కనిపిస్తోంది. అక్కడ ఎలాంటి విద్యుత్ స్తంభాలు కూడా లేవు. ఇక పైలెట్ చాకచక్యంతో చాలా స్లోగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. ముందు ల్యాండింగ్ వీల్ విరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా విమానం ల్యాండ్ అయిపోయింది. ఆ సమయంలో ఫ్యూయల్ పూర్తిగా లేకపోవడం వారి అదృష్టం. లేదంటే విమానం పూర్తిగా బ్లాస్ట్ అయ్యేది. దీంతో అక్కడి సమీప గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే వచ్చిన పోలీసులు విమానంలోని ప్రయాణికులను ఇతర వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చారు. ఏది ఏమైనా పైలెట్ చాకచక్యనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

ALSO READ:

Visitors Are Also Reading