చాణక్యుడి గురించి నేటి తరానికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తరతరాలుగా ఆయన రచించిన అర్ధశాస్త్రంలోని మెళకువలను నేటికీ మనం నేర్చుకుంటున్నాం. కేవలం అర్ధ శాస్త్రం మాత్రమే కాదు బ్రతకడానికి అవసరమైన ఎన్నో జీవిత సత్యాలను కూడా చాణుక్యుడు వివరించాడు.
Advertisement
చాణుక్యుడు చెప్పిన నీతి వాక్యాలన్నీ ప్రస్తుతం చాణక్య నీతి అన్న గ్రంధం ద్వారా నేటి తరానికి చేరుతున్నాయి. అయితే చాణుక్యుడు ప్రతి మనిషి తమ జీవితంలోని కొన్ని విషయాలను రహస్యంగా ఉంచాలని చెబుతున్నాడు. మన వ్యక్తిగత రహస్యాలను ఎవరికైనా చెబితే.. వారు ఏదో ఒక సమయంలో మనలను అలుసుగా తీసుకుని ఆడుకుంటారని అందుకే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు. ఇంతకీ మనం రహస్యంగా ఉంచాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రణాళికలు:
మనం ఏమి చేయబోతున్నాం అన్న విషయాన్నీ ఎప్పటికీ గోప్యంగానే ఉంచాలి. పనిని మొదలుపెట్టి, పూర్తి చేసేవరకూ ఏమి చేయబోతున్నామో ఎవరికీ చెప్పకూడదు. చెబితే అనుకోనివిధంగా మనకి దగ్గరైన వారిలోనే ఉన్న శత్రువులు అవాంతరాలు కలిగేలా చేయవచ్చు.
Advertisement
2. త్యాగాలు: మానవ సంబంధాలు అంటేనే సర్దుకుపోవడంతో మొదలవుతాయి. బంధం నిలుపుకోవడం కోసం మనం కొన్నిసార్లు త్యాగాలు చేయాల్సి వస్తుంది. బంధాలు, ప్రేమానురాగాలు లాంటివి కావాలనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు. అయితే వీటి గురించి కూడా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.
3. బలహీనతలు:
మన బలహీనతలను ఎప్పటికీ ఎవ్వరికి చెప్పకూడదు. ఎందుకంటే ఎదుటివారు వాటినే అదనుగా తీసుకుని మీపై అధికారం చెలాయిస్తుంటారు.
4. రాజకీయాలు: ఇక రాజకీయ విషయాలను ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకండి. సొంత విషయాలైతే వాటిని మరింత గోప్యంగా ఉంచడం మంచిది. దేశానికీ హాని కలిగించే విషయాలు అయితే వాటిని చెప్పకపోవడమే మంచిది.
మరిన్ని ముఖ్య వార్తలు:
మహిళా క్రికెటర్లను పెళ్లి చేసుకున్న ఆటగాళ్లు వీళ్ళే.. ధోని శిష్యుడితో సహా ఎవరెవరంటే?
Aarti Agarwal : ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి వాళ్లే కారణమా..?