చాణక్యుడు మనిషి తన నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ చాలా పుస్తకాలను రచించారు. అలాగే మనిషి జీవితంలో వచ్చే సమస్యలను ఎలా గుర్తించాలి… ఎలా ఎదుర్కోవాలి. అనే విషయాన్ని కూడా ఆయన వివరించారు. మనిషి జీవితాల్లో వచ్చే కష్టాలలో ఎక్కువ శాతం ఆర్ధిక పరిస్థితులు కారణంగానే వస్తుంటాయి. అందువల్ల ఆ ఆర్ధిక కష్టాలను ముందే ఎలా గుర్తించాలి అనే విషయంలో చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు బాగా పని చేస్తాయి.
Read More : పాండ్య హాఫ్ సేచరోతో ఉద్యోగం కోల్పోయిన యువకుడు..!
Advertisement
మొదటిది – ఇంట్లో గోడలు : ఒక్కరి ఇంట్లో తరచు.. ప్రతి చిన్న విషయానికి గొడవ జరుగుతుంది అంటే.. వారికీ ఆర్ధిక కష్టాలు వస్తాయి. ఎందుకంటే.. ఎక్కువ గొడవలు జరిగే చోట లక్ష్మీదేవి ఉండదు. అందువల్ల వారు కష్టాలు ఎదుర్కుంటారు.
రెండవది – తులసి చెట్టు ఎండిపోవడం : చాణక్యుడు చెప్పిన ప్రకారం ఇంట్లో ఉండే తులసి చెట్టు సంతోషకరమైన కుటుంబానికి సంకేతం. కాబట్టి ఆ తులసి ఎండిపోతే వారి సంతోషాలు పోయి ఆర్ధిక కష్టాలు వస్తాయి.
Advertisement
Read More : తండ్రో బార్బర్.. కొడుకు ఐపీఎల్ లో హీరో…!
మూడవది – నిత్యపూజా : మనిషి ఇంట్లో శాంతి, సుఖసంతోషాలు ఎప్పుడు ఉండాలంటే.. ఆ ఇంట్లో నిత్యం పూజ జరుగుతూ ఉండాలి. అలా నిత్యం దైవాన్ని ఆరాధించే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఒకవేళ నిత్యపూజా లేకపోతే ఆర్ధిక కష్టాలతో పాటుగా అన్ని రకాల కష్టనష్టాలు కూడా వస్తాయి.
నాలుగోవాది – పెద్దలను గౌరవించకపోవడం : పెద్దలను గౌరవించకపోతె ఇంట్లోని సుఖసంతోషాలు అన్ని మాయమవుతాయి. చాణక్యుడు చెప్పిన ప్రకారం పెద్దలను అవమానిస్తే వారికీ అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి.
ఐదవది – గాజులు పగలడం : చాణక్యుడు చెప్పిన ప్రకారం గాజులు పగలడం అంది చాలా అశుభం. అలా జరగడం ఇంట్లో ఎవరికీ మంచిది కాదు. గాజులు పగిలితే.. ఆ ఇంటి ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారుతుంది.