చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఆరోపించారు. చైనా నౌక ఒకటి ఆస్ట్రేలియా సిఘా విమానం పై లేజర్ ను ఉపయోగించిన తరువాత మారిసన్ ఈ విధంగా స్పందించారు. చైనా కవ్వింపు చర్యలుగానే వీటిని నేను చూస్తానని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా రక్షణ మంత్రి పీటర్ పీటర్ డట్టోన్ మాట్లాఆరు. ఇదొక ప్రమాదకర చర్య.. చైనా దూకుడు చర్యలపై ఎవరూ మాట్లాడకూడదని బీజింగ్ భావిస్తున్నట్టుంది.
Advertisement
Advertisement
ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన పీ-8ఏ పొసైడాన్ నిఘా విమానంపై లేజర్‌ను ప్రయోగించినట్టు ఆస్ట్రేలియా రక్షణ శాఖ ప్రకటించింది. పీఎల్ఏకు చెందిన రెండు నౌకలు టోరస్ జలసంధిని దాటుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లేజర్ ప్రభావంతో పైలట్లు గందరగోళానికి గురికావడం కానీ, తాత్కాలికంగా వారి కంటి చూపు దెబ్బతినడం కానీ జరుగుతుందని ఆస్ట్రేలియా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నౌకలు కోరల్ సముద్రంలో ఉన్నాయి. రెండేండ్ల క్రితం అమెరికా నిఘా విమానంపై కూడా చైనా లేజర్లను వాడినట్టు ఆరోపణలున్నాయి.
Also Read : ఏటీఎం వ్యాన్ డ్రైవర్ రూ.36 లక్షలతో పరార్.. ఎక్కడంటే..?