Home » ఏటీఎం వ్యాన్ డ్రైవ‌ర్ రూ.36 ల‌క్ష‌ల‌తో ప‌రార్.. ఎక్క‌డంటే..?

ఏటీఎం వ్యాన్ డ్రైవ‌ర్ రూ.36 ల‌క్ష‌ల‌తో ప‌రార్.. ఎక్క‌డంటే..?

by Anji
Ad

హైద‌రాబాద్‌లో భారీ చోరీ చోటు చేసుకుంది. న‌గ‌ర శివారులోని దుండిగ‌ల్‌లో ఏటీఎం కేంద్రాల‌కు డ‌బ్బు తీసుకువెళ్లే వ్యాన్ డ్రైవ‌ర్ రూ.36ల‌క్ష‌ల‌తో ప‌రార‌య్య‌డు. బేగంపేటకు చెందిన రైట‌ర్స్ సంస్థ సిబ్బంది ప‌లు ఏటీఎం కేంద్రాల్లో న‌గ‌దు జ‌మ చేస్తుంటారు. ఈ సంస్థ‌లో 20 రోజుల క్రిత‌మే సాగ‌ర్ (25) అనే యువ‌కుడు డ్రైవ‌ర్‌గా చేరాడు. శ‌నివారం మ‌ధ్యాహ్నం రూ.64ల‌క్ష‌ల న‌గ‌దుతో క‌స్టోడియ‌న్‌ల‌తో క‌లిసి సాగ‌ర్ రైట‌ర్స్ సంస్థ కార్యాల‌యం నుంచి బ‌య‌లుదేరి జీడిమెట్లలోని యాక్సిస్ బ్యాంకులో రూ.13ల‌క్ష‌ల న‌గ‌దు జ‌మ చేసారు.

Advertisement

Advertisement

జీడిమెట్ల నుంచి నేరుగా దుండిగ‌ల్ సాయిబాబా న‌గ‌ర్‌లోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎం వ‌ద్ద‌కు వెళ్లారు. క‌స్టోడియ‌న్‌లు వాహ‌నంలోని రూ.15 ల‌క్ష‌లు తీసుకుని ఏటీఎంలోకి వెళ్లారు. డ్రైవ‌ర్ సాగ‌ర్ మాత్రం వాహ‌నంలోనే ఉండి యూట‌ర్న్ తీసుకుని వ‌స్తాన‌ని గ‌న్‌మెన్‌కు చెప్పి వెళ్లిపోయాడు. అయితే ఎంత‌సేప‌టికీ సాగ‌ర్ తిరిగి రాలేదు. అత‌ని ఫోన్ కూడా స్విచాప్ వ‌చ్చింది. అనుమానం వ‌చ్చి క‌స్టోడియ‌న్‌లు, గ‌న్మెన్ క‌లిసి దుండిగ‌ల్ పోలీసుల‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. రూ.36 ల‌క్ష‌ల న‌గ‌దు బ్యాగుతో డ్రైవ‌ర్ సాగ‌ర్ పారిపోయిన‌ట్టు ఫిర్యాదులో వెల్ల‌డించారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని సాగ‌ర్ ఆచూఇ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. న‌ర్సాపూర్ రోడ్డులో పోలీసులు ఏటీఎం వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Also Read :  టాబ్లెట్ వేసుకునేట‌ప్పుడు ఆ మంత్రం జ‌పించాలి…ఉపాస‌న హెల్త్ టిప్..!

Visitors Are Also Reading