Home » తెలంగాణ, ఏపీ అప్పులు ఎంతో తెలుసా.. ఇలాగైతే కష్టమే?

తెలంగాణ, ఏపీ అప్పులు ఎంతో తెలుసా.. ఇలాగైతే కష్టమే?

by Bunty
Ad

దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్రం ప్రకటించింది. లోక్ సభలో బి.ఆర్.ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం రాష్ట్రాల అప్పుల వివరాలు వెల్లడించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రాల్లో అప్పులపై పలువురు ఎంపీలు లోక్ సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. దేశంలోని రాష్ట్రాల వారిగా అప్పుల జాబితాను కేంద్రం బయటపెట్టింది.

Read Also : తగ్గేదేలే.. ‘జనసేన’ కండువాలతో పెళ్లి..ఫోటోలు వైరల్ !

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ఏటేటా అప్పులు భారీగా పెరిగినట్లు వెల్లడించింది కేంద్రం. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018 లో ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 2.29 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం ఆ రుణం రూ. 3.98 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. మరోవైపు విభజన చట్టంలోని హామీల మేరకు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 23,110.47 కోట్లు ఆర్థిక సాయం చేశామని కేంద్రం ప్రకటించింది.

Advertisement

తెలంగాణ అప్పులు

తెలంగాణలో కూడా అప్పుల భారం పెరుగుతోందని కేంద్రం తెలిపింది. 2018లో రూ. 1.60 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు 2022 నాటికి రూ. 3.12 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించింది. 2021-22 నాటికి అప్పులు 16.7 శాతంగా ఉన్నట్టు కేంద్రం చెప్పింది. తెలంగాణ జిఎస్డిపిలో గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగాయని తెలిపింది. 2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా, ఆ తర్వాత భారీగా పెరుగుదల నమోదు అయినట్టు పేర్కొంది. 2022 నాటికి తెలంగాణ జిఎస్డిపి లో 27.4% అప్పులు నమోదు అయ్యాయని చెప్పింది.

read also : సింగర్ సునీత భర్త ఆస్తుల విలువ తెలిస్తే అస్సలు నమ్మరు ?

Visitors Are Also Reading