నటుడిగా డిఫరెంట్ క్యారెక్టర్లు పోషిస్తూ.. వర్సటైల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడని అడివి శేషు. తాజాగా హీరో నటించిన చిత్రం మేజర్ 26 /11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన రియల్ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 3వ తేదీన మేజర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్.
Advertisement
ఈ తరుణంలో ఈ సినిమా హిందీ వెర్షన్‌కు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రన్‌టైమ్ 2 గంటల 28 నిమిషాలు ఫిక్స్.. యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులను ఇందులోని కంటెంట్, లోతైన భావోద్వేగాలు ఆకట్టుకున్నట్టు సమాచారం. సినిమా కంప్లీట్ అయ్యాక స్టాండింగ్ ఓవేషన్ పోరాట యోధుడు సందీప్ ఉన్ని కృష్ణన్‌కు సెల్యూట్ చేసినట్టు తెలిసింది. ఈ సినిమాను 10 రోజుల ముందుగానే 9 నగరాల్లో స్పెషల్ షోలు ప్రదర్శిస్తున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఇప్పటికే ఓపెన్ చేసిన ప్రీ బుకింగ్స్ మంచి స్పందన వస్తుందన్నారు. స్పెషల్ షో ప్రదర్శించడం తొలిసారి కావడం విశేషం.
Advertisement
ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్రను ప్రతీ భారతీయుడు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రీ రిలీజ్ షోలు వేస్తున్నట్టు మూవీ మేకర్స్ పేర్కొన్నారు. పుణే, జైపూర్, అహ్మదాబాద్, ఢిల్లీ, లక్నో, బెంగళూరు, కొచ్చి, ముంబై, హైదరాబాద్ నగరాల్లో మేజర్ ప్రీ రిలీజ్ షోలు ప్రదర్శించనున్నారు. డిఫరెంట్ మూవీలతో టాలీవుడ్ ఆడియన్స్‌ను అలరిస్తున్న అడివి శేషు.. ఈ మూవీలో కూడా ఉన్ని కృష్ణన్ క్యారెక్టర్‌తో ఒదిగిపోయినట్టు తెలుస్తోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన మేజర్ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అడివి శేషు అందించడం విశేషం.
Also Read :
ఆచార్య వీఎఫ్ఎక్స్ విషయంలో అంత కథ ఉందా..?
సూపర్ స్టార్ కృష్ణ సినిమా విడుదల రోజే ఎందుకు 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చింది.? ఆరోజు ఏమైంది..?