Home » గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ ప్రముఖులు వీరే…!

గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ ప్రముఖులు వీరే…!

by AJAY
Ad

గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ ప్రముఖులు వీరే…!: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోని ఏ రంగంలో అయినా ఎవరూ చేయనిది చేసి చూపించిన వారు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంటారు. అయితే మన టాలీవుడ్ లోనూ కొంతమంది నటీనటులు, టెక్నీషియన్లు ఈ లిమ్ కా బుక్ లో చోటు దక్కించుకున్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

1) బ్రహ్మానందం

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం వెయ్యికి పైగా సినిమాల్లో నటించినందుకు గాను 2010లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. అంతేకాకుండా బ్రహ్మానందంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

2)సుశీల

ప్రముఖ గాయని సుశీల ఇప్పటి వరకు మొత్తం 17,695 పాటలను పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. కేవలం ఎస్.పీ.బాలసుబ్రమణ్యంతోనే 13,36 డ్యూయెట్ సాంగ్ లను సుశీల పాడారు.

3) ఎస్పీ బాలసుబ్రమణ్యం

Advertisement

ఎస్.పీ.బాలసుబ్రమణ్యం 1966 సంవత్సరం లో మర్యాద రామన్న సినిమా ద్వారా ప్లేబ్యాక్ సింగర్ గా పరిచయమయ్యారు. ఆ తర్వాత వరుసగా 36వేల పాటలను పాడి అత్యధిక పాటలు పాడిన సింగర్ గా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన పాటలు మాత్రం పలకరిస్తూనే ఉన్నాయి.

4) రామానాయుడు

టాలీవుడ్ దివంగత నిర్మాత డి.రామానాయుడు పదమూడు భాషలలో 150కి పైగా సినిమాలను నిర్మించారు. అత్యధిక సినిమాలను నిర్మించినందుకు గానూ ఆయన గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం రామానాయుడు వారసులు సురేష్ బాబు సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

5) గజల్ శ్రీనివాస్

తెలుగులో  గజల్స్ పాడి గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు గజల్ శ్రీనివాస్. ఏకంగా వంద భాషలో వంద పాటలను పాడి గజల్ శ్రీనివాస్ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్నారు.

Also Read:థర్డ్ ఎంపైర్ ను తిట్టిన కోహ్లీ.. ఎందుకంటే..?

Visitors Are Also Reading