ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్. పెళ్లి జరిగినప్పటికీ సినిమాలలో నటించే సమయంలో మరొకరితో ప్రేమలో పడతారు. మొదటి పెళ్లిని రద్దు చేసుకుని రెండో వివాహం చేసుకున్న సెలబ్రిటీలు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటి భార్య పిల్లల్ని ప్రేమగా చూసుకునే సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం….
# అక్కినేని అమల
నాగార్జున మొదటి భార్య కుమారుడు అయినటువంటి అక్కినేని నాగచైతన్యను అమల అఖిల్ తో సమానంగా చైతన్యను చూసుకుంటుంది.
# గౌతమి
కమలహాసన్ తో రిలేషన్ లో ఉన్న సమయంలో కమల్ హాసన్ మొదటి భార్య పిల్లలైనా శృతి, అక్షరలను తన సొంత కూతుర్లుగా చూసుకుంది గౌతమి.
# నిర్మలాదేవి
మోహన్ బాబు తన మొదటి భార్య చనిపోయిన అనంతరం తన పిల్లల కోసం తన భార్య చెల్లెలు అయినటువంటి నిర్మలాదేవిని వివాహం చేసుకున్నాడు. ఇక నిర్మలాదేవి తన అక్క పిల్లలు అయినటువంటి మంచు విష్ణు, లక్ష్మీలను తన సొంత పిల్లలుగా చూసుకుంటుంది.
# నందమూరి హరికృష్ణ
హరికృష్ణ ఇద్దరి భార్యలను వివాహం చేసుకున్నారు. తన మొదటి భార్య పిల్లలు అయినటువంటి కళ్యాణ్ రామ్, జానకి రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక రెండవ భార్యకు ఎన్టీఆర్ జన్మించాడు. వీరంతా సొంత అన్న తమ్ముళ్ల లాగా కలిసి మెలిసి ఉంటారు.
# రాధిక
శరత్ కుమార్ మొదటి భార్య కూతురు అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ ను తన సొంత కూతురుగా చూసుకుంటుంది రాధిక.
ఇవి కూడా చదవండి
అనుష్క సినిమా కెరీర్ లో మరిచిపోలేని పాత్రలు ఇవే !
టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్
MS Dhoni Assets : ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?