Home » ఈవీఎం హ్యాకింగ్ పై సీఈసీ షాకింగ్ కామెంట్స్..!

ఈవీఎం హ్యాకింగ్ పై సీఈసీ షాకింగ్ కామెంట్స్..!

by Anji
Published: Last Updated on
Ad

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని ప్రకటించారు. దేశంలో మహిళా ఓటర్లు ఎంత మంది..? పురుషులు ఎంత మంది..? ట్రాన్స్ జెండర్స్ ఎంత మంది..? మొత్తం ఎంత మంది అనే సమాచారాన్ని వివరించారు. వీటితో ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయని.. ఏయే రాష్ట్రంలో ఎప్పుడు జరుగుతాయో తెలిపారు రాజీవ్ కుమార్.

Advertisement

ముఖ్యంగా ఎన్నికలు జరిగిన ప్రతీ సారి ఈవీఎంల గురించి చర్చ జరుగుతుందని.. ఈవీఎంలను తీసేసి బ్యాలెట్లు పెట్టాలని కాంగ్రెస్‌ లాంటి పార్టీలు నిత్యం డిమాండ్‌ చేస్తుంటాయి. అయితే ఈవీఎంలు సేఫ్‌ అని ఇటు కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు బీజేపీ  చెబుతుంటుంది. తాజాగా 18వ లోక్‌సభ ఎన్నికల  సంబరానికి తెర లేచింది. ఎన్నికల తేదీలను ఈసీ  ప్రకటించింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ తేదీలను అనౌన్స్ చేశారు. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక తేదీల ప్రకటన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు రాజీవ్‌ చెప్పిన సమాధానాలు నెట్టింట చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా ఈవీఎంల విషయంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సెటైర్లు వేశారు రాజీవ్.

Advertisement

ఈవీఎంలపై కొన్ని రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయా లేదా అనే ప్రశ్నకు ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ విలేకరుల సమావేశంలో సమాధానమిచ్చారు. ‘షాయరీ చెప్పిన తర్వాత నేను ఈ మాటలు చెప్పడం లేదు. ఈవీఎం ఈ మాటలు చెబుతోంది. 100 శాతం ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి’ అని రాజీవ్ కుమార్ తెలిపారు. ఆయన షాయరీ అనే పదాన్ని ఉపయోగించగానే ప్రెస్‌మీట్‌లో అంతా ఒక్కసారిగా నవ్వారు. రాజీవ్ కుమార్‌ను ఈవీఎంలపై ప్రశ్నలు అడిగినప్పుడు, అతను ఈవీఎంలలో తప్పులు కనుగొన్న వారిని అవహేళన చేస్తూ తన కవితలోని కొన్ని పంక్తులను చదివారు. ‘కోరికలు నెరవేరని ప్రతిసారీ మనల్ని నిందించటం సరికాదు. విధేయత అనేది ఒకరి నుంచి వచ్చేది కాదు. రిజల్ట్స్ వస్తే మనం కూడా వాటికి అతుక్కోనట్లే..’ అని సెటైర్లు వేశారు రాజీవ్‌కుమార్‌.

Also Read : CSK కు బిగ్ షాక్.. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ ఔట్..!

Visitors Are Also Reading