గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ విషయం చర్చనీయాంశం అవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ నిందితులను అదుపులోకి తీసుకుంది. వారి ఆధారంగా చాలామందిని ప్రశ్నిస్తోంది.. ఈ తరుణంలో సిబిఐ ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలాన్ని తీసుకుంటుంది.. డిసెంబర్ 11 రోజున దాదాపు 7 గంటల పాటు కవితను సిబిఐ విచారించింది. మరి సిబిఐ విచారణలో ఏం తేలింది అనేది తెలుసుకుందాం..
Advertisement
also read:Honsika motwani: పెళ్లిలో హన్సిక వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
Advertisement
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని అధికారులు ఇప్పటికే అనుమానించి ఆమెను విచారణకు ఆదేశించారు.. ఈ తరుణంలో ఆమె బ్యాంకు లావాదేవీలు గురించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి, అరోరాతో ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.. అసలు విషయానికి వస్తే అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు ఉంది.. అయితే దీనికి భిన్నంగా కవితను ఫిక్స్ చేసేందుకు శరత్ చంద్రారెడ్డి వాగ్మూలమే ప్రధానమవుతుందని భావిస్తూ ఉన్నారు..
ఇందులో అమిత్ అరోరా కేవలం పావు మాత్రమేనని, శరత్ చంద్రారెడ్డి విజయ్ నాయర్ లు అసలు వ్యక్తులని సిబిఐ అనుమానం వ్యక్తం చేస్తోంది.. వీరి ద్వారానే కోట్లాది రూపాయలు కవిత, సిపోడియాలకు అంది ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు.. ఇవి నిజం చేయాలి అంటే మరింత లోతుగా విచారణ చేపట్టాలని, దీనికోసం కవితను ఢిల్లీలో కూర్చోబెడితేనే అన్ని విషయాలు బయట పడతాయని సిబిఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..
also read: