వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఏకంగా 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టుపై… అత్యంత దారుణంగా ఓటమిపాలైంది రోహిత్ సేన. దీంతో టీమిండియా జట్టుపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు సీనియర్లు, క్రికెట్ ఫ్యాన్స్. ఇలాంటి తరుణంలో టీమిండియా జట్టు… జూన్, జూలై నెలలో విండీస్ పర్యటనలో బిజీగా ఉండనుంది.
Advertisement
ఈ సందర్భంగా టి20 లు, వన్డే మ్యాచ్లు అలాగే టెస్టులు కూడా ఆడనుంది టీమిండియా. టి20 లో మరియు వన్డే మ్యాచ్ లకు… హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించడన్నాడు. సూర్య కుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా సేవలు అందించనున్నాడు. ఇక ఈ రెండు టోర్నీలకు రోహిత్ శర్మ, కోహ్లీ తదితర సీనియర్లు దూరం కానున్నారు. ఇది మొన్నటి వరకు జరిగిన విషయం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మాను విండీస్ జట్టుతో జరిగే టెస్ట్ మ్యాచ్లకు కూడా దూరం చేసేందుకు సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారట.
Advertisement
ముఖ్యంగా రోహిత్ శర్మాను టెస్టుల నుంచి కచ్చితంగా తప్పిస్తారని సమాచారం. డబ్ల్యూటీసి, ఐపీఎల్ 2023లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఈ తరుణంలోనే రోహిత్ శర్మను పక్కకు పెట్టి… విండీస్ తో జరిగే టెస్టులకు రహానేను కెప్టెన్ గా చేసేందుకు బీసీసీ నిర్ణయం తీసుకుందట. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. కాగా జూలై 12 నుంచి వెస్టిండీస్ పర్యటన ప్రారంభం అవుతుంది.
ఇవి కూడా చదవండి :
ప్రభాస్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. దమ్ముంటే ఓమ్ రౌత్ ను కొట్టాలంటూ..!
అసలు హర్షసాయి ఎవరు..? ఎలా ఫేమస్ అయ్యాడు