నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. కథానాయకుడిగా.. పొలిటిషియన్ గా, ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో కూడా రాణించాడు. ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ పాత్రలకు చాలా పేరు తెచ్చిపెట్టాయి. తెలుగు జాతి తెర మీద చూసిన రాముడు, కృష్ణుడు ఆయనే అనుకునే వారు. తెలుగు వారి మనస్సులో ఆరాధ్య దైవంగా నిలిచిన ఎన్టీఆర్ నటుడిగా ప్రయాణం ప్రారంభించి 73 సంవత్సరాలు అవుతోంది.
Advertisement
Advertisement
ఎన్టీఆర్ నటించిన మనదేశం మూవీ 1949 నవంబర్ 24న విడుదలైంది. ఎల్.వీ.ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఎన్టీఆర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గా చిన్న పాత్రలో కనిపించారు. పాత్రలో లీనమైపోయి లాఠీతో నిజంగానే కొట్టడం.. అప్పుడు నటన పట్ల ఆయనకు ఉన్న ఇష్టాన్ని దర్శకుడు ప్రసాద్ గుర్తించడం జరిగిపోయాయి. వీటినే బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. ఎన్టీఆర్ తో పాటు లెజెండరీ సంగీత దర్శకుడు ఘంటసాల, ప్రముఖ నేపథ్య గాయని పి.లీల కి కూడా మనదేశం తొలి చిత్రమే.
ఈ సినిమా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించిన మొదటి సినిమా. గాయని పి.లీల కూడా ఈ సినిమా ద్వారానే తెలుగు సినిమా రంగంలో నేపథ్యగాయనిగా ప్రవేశించారు. ఒకే సినిమా ద్వారా రామారావు, ఘంటసాల, పి.లీల వంటి ముగ్గురు లెజెండరీ పర్సన్స్ పరిచయం అవ్వడం విశేషం. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : “రాజధాని ఫైల్స్” సినిమా ఎలా వుంది..? కథ, రివ్యూ అండ్ రేటింగ్..!