ఐపీఎల్ 2023లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మరో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో ఆర్సిబి పరాజయం పాలైంది. అయితే… నిన్న జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. స్టాండ్స్ లో ఓ పిల్లాడు హాయ్ విరాట్ అంకుల్… వమికను డేట్ కు తీసుకెళ్లొచ్చా అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని కనిపించాడు.
READ ALSO : IPL 2023 : గాయమైనా.. జట్టు కోసం పోరాడిన RCB కెప్టెన్
Advertisement
ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారి గురించి ఇలాంటి మెసేజ్ లు ఏంటని జనాలు చీదరించుకుంటున్నారు. కొందరేమో పిల్లాడికి ఏం తెలుసు… ఆ చిన్నారి బుద్ధిలేని తల్లిదండ్రులే ఇలా చేయించి ఉంటారని అంటున్నారు.
Advertisement
READ ALSO : టాలీవుడ్లో విషాదం.. కమెడియన్ కన్నుమూత
ఇంకొందరేమో జనాల దృష్టిని ఆకర్షించేందుకు కొందరు ఇలాంటి చిల్లర పనులు చేస్తుంటారని లైట్ గా తీసుకుంటున్నారు. మెజారిటీ శాతం ఆ చిన్నారి తల్లిదండ్రులపై మండిపడుతున్నారు. కాగా… విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గారాల పట్టి వమికా అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక అటు ఈ మ్యాచ్ లో కోహ్లీ బిహేవీయర్ కు బీసీసీఐ ఫైన్ వేసిన సంగతి తెలిసిందే.
READ ALSO : Ileana :పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా….