Home » ఇండియా vs ఇంగ్లాండ్ టెస్ట్ : ఆటగాళ్ల తలపై కెమెరా..!

ఇండియా vs ఇంగ్లాండ్ టెస్ట్ : ఆటగాళ్ల తలపై కెమెరా..!

by Azhar
Ad

రేపటి నుండి ఇండియా vs ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇది రీషెడ్యుల్డ్ మ్యాచ్. అంటే గత ఏడాది సిరీస్ లో ఆఖరి మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడటంతో ఆ మ్యాచ్ ను ఇప్పుడు నిర్వహిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఇప్పుడు కొత్త ఆచారం అనేది ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టబోతుంది. అదేంటంటే.. ఆటగాళ్ల తల పై కెమెరాలను ఉంచబోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో టెక్నాలజీ అనేది చాలా అభివృద్ధి చెందింది. అందుకే క్రికెట్ ప్రపంచంలో కూడా చాలా మార్పులు వచ్చాయి.

Advertisement

ఇక క్రికెట్ లో వచ్చిన మార్పుల విధంగానే… ఈ మ్యాచ్ లను టెలికాస్ట్ చేస్తూ అభిమానులను చూపించే టీవీ ఛానెల్స్ కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎలా ఫ్యాన్స్ అను ఆకట్టుకోవాలి… వారికీ ఎలా దగ్గర కావాలి అని ఆలోచిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందులో భాగంగా ఈ ఇండియా vs ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ను టెలికాస్ట్ చేసే స్కై స్పోర్ట్స్ అనే ఛానెల్ ఈ ఆటగాళ్ల తల పైన కెమెరా అనే కొత్త విధానానికి తెరలేపుతుంది. అయితే గతంలో ఈ విధానాన్ని ఇంగ్లాండ్ లో జరిగిన ‘ది హండ్రెడ్ లీగ్’ లో వాడారు. అప్పుడు సక్సెస్ కావడంతో ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లోకి తేవాలని అనుకుంటున్నారు.

Advertisement

ఇక ఇదే ఈ టెక్నిక్ పై అనుమతి కోసం ఈ స్కై స్పోర్ట్స్ అనే ఛానెల్ ఐసీసీనీ తాజాగా సంప్రదించగా.. ఐసీసీ కూడా వెంటనే ఒప్పుకుంది. స్కై స్పోర్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ కెమెరా అనేది ఆటగాళ్లు వాడే కెమెరాలకు పెడతారు. కానీ ప్రతి ఆటగాడికి కాదు. ఏ ఫీల్డర్ అయితే షాట్ లెగ్‌లో పొజిషన్ లో.. అంటే ఈ పొజిషన్ లో బ్యాటర్ కు ఫీల్డర్ చాలా దగ్గరగా ఉంటాడు. అందుకే వారు ఈ పొజిషన్ ను ఎంపిక చేసారు. అయితే కెమెరా అనేది కేవలం విజువల్స్ మతమే రికార్డ్ చేయగలుగుతుంది. ఆటగాళ్ల మాటలను రికార్డ్ చేయలేదు. మరి చూడాలి ఇండియా, ఇండ్లను ఫీల్డర్లలో ఎవరెవరు ఈ కెమెరాను ధరిస్తారు అనేది.

ఇవి కూడా చదవండి :

టెస్ట్ కెప్టెన్ గా బుమ్రాను ప్రకటించిన బీసీసీఐ..!

కోహ్లీ సెంచరీలు కాకుండా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలి…!

Visitors Are Also Reading