ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు కేంద్ర ప్రభుత్వం ఆమెదం తెలిపింది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా శనివారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ పథకానికి ఆమోదముద్ర వేసింది. అంతే కాకుండా ఈ పథకం కోసం వచ్చే ఐదేళ్ల కోసం రూ. 1600 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది.
Advertisement
Advertisement
ఇక ఈ పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆద్వర్యంలో నేషనల్ హెల్త్ అథారిటీ అమలు చేయనుంది. ఇదిలా ఉండగా ఈ పథకంలో భాగంగా దేశ పౌరులు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కు సంబంధించిన రికార్డులను డిజిటల్ గా నమోదు చేయవచ్చు. టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా మెరుగైన వైద్య సేవలను పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ పథకం కింద 17కోట్ల ఖాతాలు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. అంతే కాకుండా ఈ రికార్డులు వైద్య రంగంలో సేవలు అందించే వారికి కూడా ఉపయోగపడనున్నాయి.