తెలుగు సినీ పరిశ్రమ యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడిగా.. తెలుగు వాడి గొప్పతనాన్ని వెలుగొందె విధంగా చేసిన నట సార్వభౌముడిగా, గొప్ప దర్శకుడిగా, అదేవిధంగా రాజకీయ నాయకుడిగా ప్రజల మనస్సు తెలుసుకున్న మంచి ముఖ్యమంత్రిగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ప్రధానంగా సినీ పరిశ్రమలో నందమూరి తారకరామారావును ఢీ కొట్టే హీరో మరొకరు లేరనే విధంగా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించారు.
Also Read : ఆ వ్యక్తి వల్లే అఖిల్ ‘ఏజెంట్’ మూవీ సర్వ నాశనం అయిందా ?
Advertisement
ముఖ్యంగా కృష్ణుడు, రాముడు, దుర్యోదనుడు, కర్ణుడు, భీముడు ఇలా ఏ పాత్రలోనైనా లీనమైపోయే నటుడు ఎన్టీఆర్. సినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకు తిరుగులేదని నిరూపించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి అప్పటికీ దశాబ్దాల నుంచి పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయానికి ఆయన పారితోషకం దాదాపు రూ.10లక్షలు అంట. ఈ విషయాన్ని ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ వెల్లడించారు. అప్పట్లో రూ.10లక్షలు అంటే దాదాపు ఇప్పటి ప్రకారం.. రూ.10 కోట్లకు సమానం అని చెప్పవచ్చు.
Advertisement
Also Read : ఆ రోజు హైదరాబాద్ లో కూడా నీడ కనిపించదు.. అది ఎప్పుడంటే?
ముఖ్యంగా ఎన్టీఆర్ ఇంత భారీ రెమ్యునరేషన్ వదులకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఎన్టీఆర్ రాష్ట్రం అంతా తిరిగారని.. రజినీకాంత్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఎన్టీఆర్ యుగ పురుషుడు అని.. పార్టీ ప్రారంభించిన 9 నెలల్లోనే రాజకీయాల్లో సంచలనం నమోదు చేశాడని ప్రశంసలు కురిపించారు రజినీకాంత్. ముఖ్యంగా శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్ ని చూసిన తరువాత మెస్మరైస్ అయిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు రజినీకాంత్. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత మద్యపాన నిషేదం, రెండు రూపాయలకు కిలో బియ్యం, పలు సంక్షేమ పథకాలతో తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేశారు.
Also Read : Chaitanya : ఢీ డాన్స్ మాస్టర్ ఆత్మహ***.. సెల్ఫీ వీడియోలో జబర్దస్త్ షో పై..