టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో లైగర్ సినిమా తెరకెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించినప్పటికీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా ఫెయిల్ కావడంతో దర్శకుడు పూరి జగన్నాథ్ రకరకాల వార్తలు వినిపిస్తూ వచ్చాయి.
తాజాగా పూరి జగన్నాథ్‌ని కొందరూ బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. లైగర్ మూవీతో దర్శకుడు పూరి జగన్నాథ్‌తో పాటు బయ్యర్స్ కూడా భారీగానే నష్టపోయారట. సినిమా నష్టపోవడం వల్ల తమ పరిస్థితి ఏంటని బయ్యర్స్ అడగడంతో అందరికీ నష్టపరిహారం చెల్లిస్తామని పూరి చెప్పారు. ఆంధ్రాకి రూ.6కోట్లు, నైజాంకి రూ.4.5 కోట్లు, సీడెడ్‌కి రూ.2.25 కోట్లు వెనక్కి ఇవ్వడానికి నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మీలు అంగీకరించారట. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Advertisement
Advertisement
”ఏంటీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..? నేను ఎవ్వరికీ తిరిగి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా ఇస్తున్నాను ఎందుకు ? నేను ఎవ్వరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. పాపం వాళ్లు కూడా నష్టపోయారులే అని. ఆల్రెడీ బయర్స్ తో మాట్లాడడం జరిగింది. ఒక నెల రోజుల్లో అగ్రిమెంట్ కుదుర్చుకున్న అమౌంట్ ఇస్తాను అని చెప్పాను. ఇస్తాను అని చెప్పిన తరువాత కూడా అతి చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ది కాదు. ఎందుకు ఇస్తున్నాం ? పరువు కోసం ఇస్తున్నాం, నా పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. కొన్ని ఆడతాయి. కొన్ని పోతాయి.
సినిమా హిట్ అయితే బయ్యర్స్ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడానికి మేము తిరగాలి. పోకిరి దగ్గర నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు బయ్యర్స్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ఎన్నో ఉన్నాయి. బయ్యర్స్ అసోసియేషన్ నాకు ఆ అమౌంట్ వసూలు చేసి పెడతదా ? నార్త్ లెక్కలకి మన డిస్ట్రిబ్యూటర్ల లెక్కలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ధర్నా చేస్తాం అంటున్నారు చేయండి. ధర్నా చేసిన వారి లిస్ట్ తీసుకొని.. వాళ్లకి తప్ప మిగతా వాళ్లందరికీ డబ్బు ఇస్తా” అంటూ పూరి కోపంతో మాట్లాడిన ఈ ఆడియో సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుందనే చెప్పాలి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ధర్నా చేస్తారా లేదా వెనకడుగు వేస్తారో వేచి చూడాలి.