Home » ఒకప్పుడు క‌లెక్ష‌న్స్ కింగ్ ఇప్పుడు క‌లెక్ష‌న్స్ నిల్…దారుణ‌మైన క‌లెక్ష‌న్ల వెన‌క‌ కార‌ణాలు ఇవేనా..?

ఒకప్పుడు క‌లెక్ష‌న్స్ కింగ్ ఇప్పుడు క‌లెక్ష‌న్స్ నిల్…దారుణ‌మైన క‌లెక్ష‌న్ల వెన‌క‌ కార‌ణాలు ఇవేనా..?

by AJAY
Ad

ఒకప్పుడు స్టార్ హీరోలుగా రాణించిన వారిలో మంచు మోహన్ బాబు కూడా ఒక‌రు. మ‌మోహన్ బాబు సినిమాలకు అత్యధిక కలెక్షన్లు వచ్చేవి. దాంతో మోహన్ బాబు పేరు కలెక్షన్ కింగ్ గా మారిపోయింది. అయితే అప్పటి కలెక్షన్ కింగ్ సినిమాలకు ఇప్పుడు కలెక్షన్స్ నిల్ గా కనిపిస్తున్నాయి. కేవ‌లం మోహ‌న్ బాబు సినిమాల‌కే కాకుండా ఆయ‌న కుమారుడు మంచు విష్ణు సినిమాల‌కు కూడా దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. మంచు మోహన్ బాబు నట వారసులుగా విష్ణు, మనోజ్ ఎంట్రీ ఇచ్చిన‌ సంగతి తెలిసిందే.

Advertisement

అయితే మంచు ఫ్యామిలీ నుండి ఏ సినిమా వచ్చినా గతంలో కలెక్షన్లు బాగానే ఉండేవి. కానీ కొంతకాలంగా మాత్రం వీరి సినిమాలకు దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. రీసెంట్ గా విష్ణు హీరోగా నటించిన మోసగాళ్లు సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించామ‌ని తెలిపారు. సినిమాలో భారీ తార‌గ‌ణం నటించారు. సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు సైతం ముఖ్యమైన పాత్ర‌లో నటించారు.

Advertisement

Mosagallu

Mosagallu

అయినప్పటికీ ఈ సినిమా కేవలం రెండు కోట్ల రూపాయలకు అటు ఇటుగా కలెక్షన్లను రాబట్టింది. అదేవిధంగా మోహన్ బాబు హీరోగా నటించిన సన్నాఫ్ ఇండియా సినిమాకు సైతం ఇదే స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఇక రీసెంట్ గా దసరా కానుకగా మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా నష్టాలను మూట కట్టుకుంటుంది. ఈ సినిమాకు టికెట్లు చాలా తక్కువగా అమ్ముడుపోతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే ఇలా కలెక్షన్లు రావడానికి కారణం తమపై వస్తున్న ట్రోలింగ్ మాత్రమే అంటూ మంచి విష్ణు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మా ఎలక్షన్ల సమయం నుండి తమ‌పై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. జిన్నా విడుదల కాకముందే నెగిటివ్ ప్రచారం మొదలైందని చెప్పారు. కొంతమంది పనిగట్టుకుని ఆఫీసులను మెయింటైన్ చేస్తూ మరీ ఇలాంటివి చేస్తున్నారని తెలిపారు. తాము దీనిపై లీగల్ గా వెళ్తున్నామని ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానల్ లకు నోటీసులు కూడా ఇచ్చామని పేర్కొన్నారు.

Visitors Are Also Reading