Home » బిగ్ బాస్7 విన్నర్ కు బంపర్ ఆఫర్.. రూ.50 లక్షల ఫ్రైజ్ మనీతో పాటు ఏం ఇస్తారంటే ?

బిగ్ బాస్7 విన్నర్ కు బంపర్ ఆఫర్.. రూ.50 లక్షల ఫ్రైజ్ మనీతో పాటు ఏం ఇస్తారంటే ?

by Anji
Ad

బిగ్ బాస్ షో సీజన్7 విన్నర్  ఎవరనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తున్నాయి.శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్   టాప్3 లో ఉండే అవకాశం అయితే ఉంది.ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి గౌతమ్ ఎలిమినేట్ కానుండగా వచ్చేవారం శోభాశెట్టి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 15వ వారం మిడ్ వీక్ లో ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇవాళ బిగ్ బాస్ షోకి టాలీవుడ్ హీరో నాని వచ్చాడు. హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని బిగ్ బాస్ హౌస్ కి చేరుకొని కంటెస్టెంట్స్ తో మాట్లాడాడు.

Advertisement

ఈ వారం ఎపిసోడ్ కు నాని గెస్ట్ గా హాజరయ్యారు. సీజన్ 7 విన్నర్ కు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ లభించనుందని సమాచారం అందుతోంది. ఈ సీజన్ విజేతగా నిలిచిన వాళ్లకు బ్రేజా కార్ తో పాటు జాయ్ అలుక్కాస్ 15 లక్షలు అందనున్నాయని నాగ్ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షో సీజన్ 7 విన్నర్ కు 80 లక్షల రూపాయలకు అటు ఇటుగా దక్కే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షో సీజన్ 7 మంచి రైటింగ్ లను సొంతం చేసుకుంటూ అందరినీ ఆకట్టుకుంటుంది.

ఇక వీకెండ్ తో పాటు వీక్ డేస్ లో కూడా ఈషో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుండటం గమనార్హం. తర్వాత సీజన్లకు కూడా నాగార్జున హోస్ట్ గా కొనసాగాలని నేటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రధానంగా యూత్ ను ఆకట్టుకోవడంలో బిగ్ బాస్ షో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించింది. స్టార్ మా ఛానల్ రేంజ్ ను ఈ షో మరింత పెంచింది. బిగ్ బాస్ షో ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతుంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading