Home » బుల్లెట్టుబండి వ‌ధువుకు క్రేజీ ఆఫ‌ర్..త్వ‌ర‌లోనే ఆ షో ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు..!

బుల్లెట్టుబండి వ‌ధువుకు క్రేజీ ఆఫ‌ర్..త్వ‌ర‌లోనే ఆ షో ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు..!

by AJAY
Ad

ప్రైవేట్ ఆల్బమ్ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేస్తా సాంగ్ ఎంత క్రేజ్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక ఈ పాట‌కు తెలంగాణ‌లోని జ‌న్నారంకు చెందిన న‌వ‌వ‌ధువు సాయి శ్రీయ పెళ్లి బ‌రాత్ లో స్టెప్పులు వేయ‌డంతో మ‌రింత క్రేజ్ వ‌చ్చింది. ఒకే రోజులో ఈపాట యూట్యూబ్ ను షేక్ చేసింది. అంతే కాకుండా సాయి శ్రీయ స్టెప్పులు వేసిన త‌ర‌వాత ఎక్క‌డ చూసినా కూడా బుల్లెట్లు బండి పాట‌నే వినిపించ‌డం మొద‌ల‌య్యింది. దాంతో సాయి శ్రీయ ఇంటర్వ్యూలు తీసుకునేందుకు యూట్యూబ్ ఛానల్లు ఎగ‌బ‌డ్డాయి.

bullet bandi sai priya

bullet bandi sai priya

అంతే కాకుండా సాయి శ్రీయ‌తో మరో ప్రైవేటు ఆల్బం తీస్తామ‌ని బుట్టెట్ బండి పాట నిర్మాతలు ఆఫ‌ర్ కూడా ఇచ్చారు. ఈ ఆఫ‌ర్ కు సాయిశ్రీయ ఓకే చెప్పింది. ఇదిలా ఉండ‌గానే సాయిశ్రీయ‌కు మ‌రో బంప‌రాఫ‌ర్ వ‌చ్చినట్టు స‌మాచారం అందుతోంది. త్వ‌ర‌లోనే బిగ్ బాస్ ఓటీటీ ని ప్రారంభిస్తున్నట్టు నాగార్జున ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ బిగ్ బాస్ ఓటీటీ కోసం ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారిన సాయి శ్రీయ‌ను నిర్వాహ‌కులు సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

Advertisement

also read  : 1996 లో వెండితెరకు దూరంగా ఉన్న మెగాస్టార్..కారణం ఏంటంటే..?

దాంతో బిగ్ బాస్ ఆఫ‌ర్ కు సాయి శ్రీయ కూడా ఓకే చెప్పినట్టు స‌మాచారం. ఇదే గ‌నక నిజం అయితే త్వ‌ర‌లోనే సాయి శ్రీయ బిగ్ బాస్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే వారిలో యాంక‌ర్ శివ‌, యాంక‌ర్ వ‌ర్షిణి, ఢీ రాజు, దుర్గారావు స‌హా ప‌లువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ ఓటీటీ హాట్ స్టార్ లో 24గంట‌లు ప్ర‌సారం కానున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ షో ఏ మేర‌కు అలరిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading