Home » నేనూ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసాను.. BRS MLA సంచలన కామెంట్స్..!

నేనూ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసాను.. BRS MLA సంచలన కామెంట్స్..!

by Sravya
Ad

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల పరిధిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తో పాటు హాజరయ్యారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటమిలో సహజమని చెప్పారు. ఇప్పటి రాజకీయాలు వేరు, అప్పటి రాజకీయాలు వేరు అని అన్నారు.

Advertisement

Advertisement

అలానే ఆయన మాట్లాడుతూ, పాత నాయకులంతా కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వాళ్లే అని చెప్పారు. గతం లో జీవన్ రెడ్డి కూడా టిడిపి లో ఉండే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారని చెప్పారు. గతం లో తమ కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నారని నేను చిన్నప్పుడు అదే జెండాని పట్టుకుని వీధులు వెంట తిరిగానని అన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే ఆ పార్టీకి ఓటు వేశానని సంజయ్ కుమార్ చెప్పారు ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading