Home » తమ్ముడి పుట్టిన రోజు.. విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్..!

తమ్ముడి పుట్టిన రోజు.. విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్..!

by Anji
Ad

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన మృణాల్, ఠాకూర్ కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలోకి రానుంది.

Advertisement

Advertisement

అయితే విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ గతేడాది బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు తాజాగా ఇవాళ ఆనంద్ బర్త్ డే కావడంతో అన్న విజయ్ స్పెషల్ ట్వీట్ చేశారు. తమ్మునితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. నాతో ఫైట్ చేసే మొదటి అబ్బాయికి హ్యాపీ బర్త్ డే అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు సైతం హీరోకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం గమనార్హం.

Also Read :  బాలయ్య సినిమాను రీమేక్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్..!

 

Visitors Are Also Reading