Telugu News » బ్ర‌ద‌ర్ అనిల్ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా..? ఆ వ్యాఖ్య‌ల వెన‌క అస‌లు అర్థం ఏంటి..!

బ్ర‌ద‌ర్ అనిల్ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా..? ఆ వ్యాఖ్య‌ల వెన‌క అస‌లు అర్థం ఏంటి..!

by AJAY MADDIBOINA

దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అల్లుడు, ష‌ర్మిల భ‌ర్త పాస్ట‌ర్ అనిల్ కుమార్ సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు ఉండ‌వ‌ల్లితో స‌మావేశం అయ్యారు. రాజ‌మండ్రిలో అనిల్ కుమార్ ఉండ‌వ‌ల్లితో స‌మావేశామ‌య్యారు. అనంత‌రం అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ…మీరు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా అని ప్ర‌శ్నించ‌గా మాత్రం…. త‌మ కుంటుంబం ముందు నుండి రాజ‌కీయాల‌లో ఉంద‌ని వ్యాఖ్యానించారు. త‌న‌కు రాజ‌కీయాల గురించి తెలియ‌ద‌ని ఉండ‌వ‌ల్లి వద్ద తెలుసుకోవడానికి వ‌చ్చానని చెప్పారు.

Ads

అంతే కాకుండా ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ త‌న‌కు ఓ పుస్త‌కం ఇచ్చార‌ని చెప్పారు. ఈ భేటీలో ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్య‌త లేద‌ని..నో అజెండా నో జెండా అంటూ అనిల్ వ్యాఖ్యానించారు. మామ వైఎస్ఆర్ కు ఉండ‌వ‌ల్లి స‌న్నిహితుల‌ని అందుకే క‌ల‌వ‌డానికి వ‌చ్చాన‌ని అన్నారు. ఏపీ తెలంగాణ‌లో ఏం జ‌రుగుతుంది అన్న‌దానిపై చ‌ర్చించామ‌ని అన్నారు. ఏపీలో ప‌రిపాల‌న గురించి మీ అభిప్రాయం ఏంట‌ని ప్ర‌శ్నించ‌గా….నో కామెంట్స్ మీరు చూస్తున్నారు కదా అంటూ అనిల్ కుమార్ స‌మాధానం ఇచ్చారు.

అంతే కాకుండా రాజకీయాల్లోకి వ‌స్తారా అంటే దేవుడు చెబితేనే నేను చేస్తాన‌ని అన్నారు. దేశంలో మ‌త‌ప‌ర‌మైన గొడ‌వ‌లు పెరుగుతున్నాయి దానిపై మీ అభిప్రాయం ఏంట‌ని ప్ర‌శ్నించ‌గా….అవి ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయ‌ని ఇప్పుడు కొంచెం పెరిగాయ‌ని అన్నారు. ఉండ‌వ‌ల్లి తో స‌మావేశం వెన‌క ఏముంది అని అడిగితే మా సీక్రెట్స్ మాకు ఉంటాయ్ అంటూ తిప్పి తిప్పి స‌మాధానం ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ…వైఎస్ ఆర్ సీఎం గా ఉన్న‌ప్పుడు ఇలా మాట్లాడుకునేవాళ్లమని అన్నారు.

అనిల్ అప్పుడూ ఇప్పుడు అలానే ఉన్నారని చెప్పారు. చాలా విషయాలు మాట్లాడుకున్నామని అన్నారు. అయితే గ‌తంలో రాజ‌కీయాల్లోకి వస్తారా అంటే మాత్రం అనిల్ కుమార్ తాను దైవ సేవ‌కుడిన‌ని వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని స‌మాధానం ఇచ్చేవారు. కానీ ఈ సారి మాత్రం ఆయ‌న దేవుడి పిలుపు ఉంటే వ‌స్తాన‌ని చెప్ప‌డం..మా కుంటుంబం ముందు నుండి రాజ‌కీయాల్లో ఉన్నామ‌ని చెప్ప‌డం చూస్తుంటే అనిల్ కుమార్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.


You may also like