ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, ఏపీగా రెండుగా చీలినప్పటి నుంచి రాజకీయాలు ఎంతో రసవత్తరంగా మారాయి. తొలుత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యారు. తాజాగా ఏపీలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఓ వైపు వైసీపీ, మరొక వైపు టీడీపీ, బీజేపీ, పవన్ ఇలా అందరూ ఇప్పటి నుంచే సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు.
Advertisement
ఈ తరుణంలోనే బ్రదర్ అనిల్ ఆధ్వర్యంలో విజయవాడలో ఓ ప్రైవేటు హోటల్లో బీసీ మైనార్టీ క్రిస్టియన్ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీ వెల్పేర్ సంఘం నాయకులు నేతలు సమావేశమయ్యారు. బీసీ వెల్పేర్ సంఘం నాయకులు శొంఠి నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. బ్రదర్ అనిల్ వచ్చి మాతో సమావేశాలు చేయడం వల్ల అప్పట్లో మేము ఓటు వేసి వైసీపీని గెలిపించామని కనీసం మా సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం అవసరం అని బ్రదర్ అనిల్‌కు చెప్పామని, దీనిపై సానుకూలంగా స్పందించి తగు నిర్ణయం తీసుకుంటాం అని అనిల్ చెప్పారన్నారు. బీసీ వెల్పేర్ సంఘం నాయకులు శొంటి నాగరాజు. 2019 ఎన్నికల్లో బ్రదర్ అనిల్‌కుమార్ వై.ఎస్.జగన్ గెలిపించారు. ఇవాళ కష్టపడి పని చేసిన కార్యకర్తలకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. బ్రదర్ అనిల్ ఏపీలో రాజకీయ పార్టీ పెట్టాలని బీసీ వెల్పేర్ శొంఠి నాగరాజు డిమాండ్ చేశారు.
Also Read : Video Viral : పుష్ప స్టైల్లో తగ్గేదేలే అంటున్న విరాట్ కోహ్లీ..!