Home » Video Viral : పుష్ప స్టైల్‌లో త‌గ్గేదేలే అంటున్న విరాట్ కోహ్లీ..!

Video Viral : పుష్ప స్టైల్‌లో త‌గ్గేదేలే అంటున్న విరాట్ కోహ్లీ..!

by Anji
Ad

మొహ‌లీ మూడు రోజుల్లో భార‌త్‌-శ్రీ‌లంక మ‌ధ్య తొలిటెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్ భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎంతో ప్ర‌త్యేకం. భార‌త‌దేశం త‌రుపున 100 టెస్టుల ఆడిన 12 వ భార‌తీయ క్రికెట‌ర్‌గా నిలిచాడు. అంతేకాదు. టెస్ట్ క్రికెట్‌లో 8వేల ప‌రుగుల‌ను మొద‌టి రోజు కోహ్లీ త‌న బ్యాటింగ్‌లో అధిగ‌మించాడు. సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉన్న భార‌త్ రెండ‌వ టెస్ట్ కోసం బెంగ‌ళూరుకు వెళ్ల‌నుంది. మొహ‌లీ టెస్ట్‌లో భార‌త్ ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్ర‌మే బ్యాటింగ్ చేసినా మైదానంలో కోహ్లీ త‌న చేష్ట‌ల‌తో అల‌రించాడు.

Also Read :  రూ.2.56 ల‌క్ష‌ల‌తో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన తెలంగాణ ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు

Advertisement

Advertisement


క్రికెట‌ర్ల‌లో బాగా పాపుల‌ర్ అయిన ట్రెండ్ల‌లో అల్లుఅర్జున్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ పుష్ప ఒక‌టి. సినిమాలోని డైలాగ్‌ల నుంచి పాటల వ‌ర‌కు సినిమాకు సంబంధించిన ప్ర‌తి అంశం అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఆదివారం అల్లుఅర్జున్ ఐకానిక్ స్టైల్‌ను భార‌త్ స్టార్ కోహ్లీ అనుక‌రించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో 45 ప‌రుగులు చేసిన కోహ్లీ ఎడ‌మ చేతి స్పిన్న‌ర్ ల‌సిత్ ఎంబుల్డేనియా చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భార‌త్ ఇన్నింగ్స్ 222 ప‌రుగుల తేడాతో శ్రీ‌లంక‌ను చిత్తు చేయ‌డంతో కోహ్లీకి ఈ మ్యాచ్‌లో మ‌ళ్లీ బ్యాటింగ్ చేసే అవ‌కాశం రాలేదు.

Visitors Are Also Reading