Home » BRO OTT Release : బ్రో ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్… ఎందులో అంటే?

BRO OTT Release : బ్రో ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్… ఎందులో అంటే?

by Bunty
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా చేసిన మూవీ బ్రో. ఈ సినిమా తమిళంలో విజయవంతమైన వినోదమేసితం అనే సినిమాకు రీమేక్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించగా సముద్రఖని దర్శకత్వం వహించి అందరిని మెప్పించాడు. పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో ప్రియా వారియర్, కేతిక శర్మ హీరోయిన్లు గా నటించారు.

Advertisement

అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వసి ఓ ఐటమ్ సాంగ్ కూడా చేసింది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ దేవుడి గెటప్ లో కనిపించాడు. అటు సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో మెయిన్ హీరోగా ప్రోజెక్ట్ అయ్యాడు. ఇక ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యి చాలా విజయవంతంగా నడుస్తోంది. కలెక్షన్ కూడా బాగా రాబడుతోందని సమాచారం అందుతుంది.

Advertisement

ఈ తరుణంలో బ్రో సినిమా ఓటీపీ రిలీజ్ డేట్ గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బ్రో సినిమా ఓటీపీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతుంది. అలాగే ఈ సినిమాలో భారీ ధర పెట్టి నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందట. సెప్టెంబర్ రెండో తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే అన్న సంగతి మన అందరికి తెలిసిందే. అదే రోజున ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలని నెట్ ఫ్లిక్స్ సంస్థ భావిస్తోందట. ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కాగా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు భారీ ధరకు కొనుగోలు చేసింది.

Visitors Are Also Reading