Home » ప‌రీక్ష రాయ‌డానికి వ‌చ్చిన పెళ్లికూతురు!

ప‌రీక్ష రాయ‌డానికి వ‌చ్చిన పెళ్లికూతురు!

by Azhar

రాజ్‌కోట్ శాంతి నికేతన్ కాలేజీ లో బ్యాచ్ ల‌ర్ ఆఫ్ సోష‌ల్ వ‌ర్క్ (BSW) లో డిగ్రీ చదువుతున్న శివంగి బగ్తారియా పెళ్లిదుస్తువుల‌ను ధ‌రించి ప‌రీక్ష రాయ‌డానికి వ‌చ్చారు. ఒక‌వైపు డిగ్రీ ఐద‌వ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు మ‌రోవైపు త‌న పెళ్లి ఉండడంతో …. భ‌ర్త‌ను ఒప్పించి ప‌రీక్ష రాయ‌డానికి ప‌రీక్ష హాల్ కు వ‌చ్చారు.

ప‌రీక్ష రాశాక అటు నుండి డైరెక్ట్ గా ఫంక్ష‌న్ హాల్ కు వెళ్లి వివాహం చేసుకుంది. ఈమె ఫోటోలు సోష‌ల్ మీడియాలో ఒక్క‌సారిగా వైర‌ల్ అయ్యాయి. పెళ్లి ఉండి కూడా ప‌రీక్ష రాయ‌డానికి వ‌చ్చిన శివంగికి, త‌న‌కు స‌పోర్ట్ ఇచ్చిన ఆమె భ‌ర్త‌ను అభినందిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు నెటీజ‌న్లు.


You may also like