Home » సంక్రాంతి సినిమాల బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ ఇవే.. ఏ సినిమా ఎంత సాధించాలంటే?

సంక్రాంతి సినిమాల బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ ఇవే.. ఏ సినిమా ఎంత సాధించాలంటే?

by Srilakshmi Bharathi
Ad

సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా గట్టి పోటీ ఉంటుందన్న సంగతి తెలిసినదే. ఈసారి కూడా పోటీ గట్టిగానే ఉంది. గుంటూరు కారం, హనుమాన్, నా సామి రంగ, సైంధవ్ వంటి సినిమాలు ఈ సారి బరిలో ఉన్నాయి. అన్ని సినిమాలు వేటికవే ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. అందరికి ఫస్ట్ ఛాయస్ గా గుంటూరు కారం సినిమా ఉంది. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్, అటు మాస్ ఆడియన్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. తరువాత ఛాయస్ గా హనుమాన్ సినిమా ఉంది. ఈ సినిమా కూడా పిల్లలను, ఫామిలీ ఆడియన్స్ ను థియేటర్ వరకు రప్పిస్తుంది.

Advertisement

Advertisement

నా సామి రంగ, సైంధవ్ సినిమాలకు కూడా గట్టిగానే అంచనాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాల బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. గుంటూరు కారం సినిమా రూ.135 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇదేమి చిన్న టార్గెట్ కాదు. ఇప్పటికే ఉన్న అంచనాలను మైండ్ లో ఉంచుకుంటే ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే ఉంటాయని తెలుస్తోంది. హనుమాన్ సినిమా రూ.25 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చెయ్యాల్సి ఉంది. దీనికి కూడా పాజిటివ్ టాక్ రాకుంటే ఆ కలెక్షన్ కష్టం అవుతుంది.

అలాగే వెంకటేష్ ‘సైంధవ్’ కూడా రూ.25 కోట్లు కలెక్ట్ చెయ్యాల్సి ఉంది. నాగార్జున ‘నా సామి రంగ’ మూవీ కూడా రూ.18 కోట్ల షేర్ ను రాబట్టేస్తే గట్టెకేసినట్లే. అయితే.. అన్ని సినిమాల్లోనూ నా సామీ రంగ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన బ్రేక్ ఈవెన్ సాధించడం చాలా ఈజీ అయిపోతుంది. ఈసారి సంక్రాంతికి గట్టి పోటీనే ఉంది. ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందా? అని ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading