Home » బ్రహ్మానందం ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా ?

బ్రహ్మానందం ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా ?

by Bunty
Ad

కమెడియన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హాస్యనటుడుగా ప్రతి ఒక్క సినిమాలో కనిపించి ప్రేక్షకులను మెప్పిస్తాడు. తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. సినిమాల్లో కేవలం తన కామెడీ వల్లనే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

Advertisement

తన నటనకు గాను ఎన్నో అవార్డులను అందుకున్నాడు బ్రహ్మానందం. 31 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీని ఏలుతూ దాదాపు బ్రహ్మానందం 1200 పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు కొన్ని సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. ఇక బ్రహ్మానందం సినిమాల్లో నటిస్తూ బాగానే ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.

Advertisement

దాదాపు తన ఆస్తి విలువ 500 నుంచి 600 కోట్ల వరకు ఉంటుందని… అంతేకాకుండా జూబ్లీహిల్స్ లో ఓ బంగ్లా కూడా ఉందని, కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా తన పేరిట ఉన్నాయని సమాచారం. ఇక బ్రహ్మానందం కొడుకులు కూడా బాగానే సంపాదిస్తున్నారు. బ్రహ్మానందం పెద్దకొడుకు సినిమాల్లో పెద్దగా రాణించనప్పటికీ పలు బిజినెస్లు చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. తన చిన్న కొడుకు కూడా బాగానే ఆస్తులు సంపాదిస్తున్నట్లు సమాచారం.

Visitors Are Also Reading