Home » బ్ర‌హ్మంగారు భ‌విష్య‌త్‌లో ఏమేం జ‌రుగుతాయో చెప్పిన విష‌యాల గురించి మీకు తెలుసా..?

బ్ర‌హ్మంగారు భ‌విష్య‌త్‌లో ఏమేం జ‌రుగుతాయో చెప్పిన విష‌యాల గురించి మీకు తెలుసా..?

by Anji
Ad

సాధార‌ణంగా ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ఠ‌క్కున అంటుంటారు చాలా మంది బ్ర‌హ్మంగారు అప్పుడే చెప్పాడు అని మ‌నం వింటుంటాం. బ్ర‌హ్మంగారు ఎవ‌రు..? ఆయ‌న‌కు కాల‌జ్ఞానం చెప్పే శ‌క్తి ఎలా వ‌చ్చింది. భ‌విష్య‌త్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌ల గురించి బ్ర‌హ్మంగారు ఏమేమి చెప్పారనే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

 

బ్ర‌హ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి. 1608 సంవ‌త్స‌రంలో పోతులూరి ప‌రిపూర్ణాచార్యులు, ప్ర‌కృతాంబ దంప‌తుల‌కు కాశీ ప‌ట్ట‌ణంలో వీర బ్ర‌హ్మేంద్ర‌స్వామి జ‌న్మించారు. కొద్ది సంవ‌త్స‌రాల త‌రువాత క‌ర్ణాట‌క స్కంధ‌గిరి ప‌ర్వ‌త‌సానువుల్లో ఉన్న పాపాజ్ఞి మ‌ఠం అధిప‌తులు అయిన వీర భోజ‌యాచార్య‌, వీర పాప‌మాంబ‌ల వ‌ద్ద పెరిగి అక్క‌డి నుంచి క‌డ‌ప జిల్లాలోని కందిమ‌ల్లాయ‌ప‌ల్లి చేరుకుని అచ్చ‌మాంబ వ‌ద్ద ప‌శువుల‌ను కాస్తూ ర‌వ్వ‌ల‌కొండ‌లో కాల‌జ్ఞానాన్ని రాసారు. ఇత‌ను సాక్షాత్తూ దైవ‌స్వ‌రూపుడు. చిన్న‌ప్ప‌టి నుంచే ఎన్నో మ‌హిమ‌లు చూపించిన ఆయ‌న భ‌విష్య‌త్ ను త‌మ మ‌నోనేత్రంతో ద‌ర్శిస్తూ కాల‌జ్ఞానాన్ని ర‌చించారు. ఇప్ప‌టివ‌ర‌కు బ్ర‌హ్మంగారు చెప్పిన‌వి అన్ని చాలా వ‌ర‌కు జ‌రిగాయి. భ‌విష్య‌త్‌లో మెరెన్నో సంఘ‌ట‌న‌లు భ‌విష్య‌త్‌లో జ‌రుగ‌నున్నాయి. అవి ఏమిటంటే..? ఒక అంబ 16 సంవ‌త్స‌రాలు రాజ్య‌మేలుతుంది. ఇందిరాగాంధీ 16 సంవ‌త్స‌రాలు ప్ర‌ధానిగా ప‌ని చేశారు. గ‌ట్టి వాడైన పొట్టి వాడు ఒక‌రు దేశాన్ని ప‌రిపాలిస్తారు. పొట్టిగా ఉన్న‌ది లాల్ బ‌హ‌దూర్ శాస్త్రీ. ఆయ‌న అవినీతి, ప‌క్ష‌పాతానికి లొంగ‌కుండా జ‌న‌రంజ‌క‌రంగా దేశాన్ని ప‌రిపాలించారు. తెర‌మీది బొమ్మ‌లు గ‌ద్దెనెక్కుతారు. సినిమా రంగం నుంచి వ‌చ్చిన ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌, జ‌య‌ల‌లిత ప‌రిపాల‌న కొనసాగించిన విష‌యం తెలిసిందే.

ఇక నీటితో దీపాలు వెలుగుతాయి అంటే ప్ర‌స్తుతం జ‌ల‌విద్యుత్ కేంద్రాల‌తో నిజ‌మైంది. ఆకాశాన ప‌క్షి వాహ‌నాదులు కూలి చాలా మంది న‌శిస్తారు. ప‌క్షి వాహ‌నాలు అన‌గా విమానాలు. ఇప్ప‌టివ‌ర‌కు విమానాలు కూలి చాలా మంది మ‌ర‌ణించారు భ‌విష్య‌త్‌లో కూడా మ‌రణిస్తారు. దేవ‌స్థానాలు పాపాత్ముల వ‌ల్ల నాశ‌న‌మ‌వుతాయి. దేవుళ్ల విగ్ర‌హాలు దొంగిలించ‌బ‌డ‌తాయి. ఇప్ప‌టికే చాలా ఆల‌యాల్లో విగ్ర‌హాలు ధ్వంసం అవ్వ‌డ‌మో, దొంగిలించ‌డ‌మో ఏదో జ‌రిగిన ఘ‌ట‌న‌లు మ‌నం చూస్తూనే ఉన్నాం. విచిత్ర వ్యాదుల ద్వారా కూర్చున్న వారు కూర్చున్న‌ట్టు, నిలుచున్న వారు నిల్చున్న‌ట్టు మ‌ర‌ణిస్తుంటారు. ఇక ఇప్ప‌టికే అంతు చిక్క‌ని మ‌హ‌మ్మారులు ఎన్నో పుట్టి ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తున్నాయి. శ్రీ వేంక‌టేశ్వ‌రునికి మ‌హ‌మ్మ‌దీయులు కూడా పూజ‌లు చేస్తారు. వెంక‌టేశ్వ‌రుడికి మ‌హ‌మ్మ‌దీయ వ‌నిత బీబీనాంచారి భార్య కావ‌డం వ‌ల్ల ముస్లిలు శ్రీ‌నివాసుడిని అల్లుడిగా భావించి కొలుస్తుంటారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  చాణక్య నీతి: ఇలాంటి అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోకూడదు..!!


ఒక‌రి భార్య‌ను మ‌రొక‌రు వ‌శ‌ప‌రుచుకుంటారు. స్త్రీ, పురుషులు కామం చేత పీడితుల‌వుతారు. స‌మాజంలో రోజు రోజుకూ వివాహేత‌ర సంబంధాలు ఎక్కువ అవుతుంటాయి. వీటి వ‌ల్ల క‌ట్టుకున్న భ‌ర్త‌ను, క‌న్న వారిని బ‌లి తీసుకుంటున్న సంఘ‌ట‌న‌ల‌ను మ‌నం చూస్తూనే ఉన్నాం. గండ‌కి న‌ది ఒడ్డు రాళ్లు నృత్యం చేస్తాయి. ఇక గండ‌కి న‌ది ఒడ్డున నేపాల్ లో భూకంపం వ‌చ్చి ఎంత విధ్వంసం సృష్టించిందో మ‌న‌కు తెలిసిందే. రావ‌ణుడి కాష్టాన క‌ల్లోలం చెల‌రేగి దేశాన్ని అల్ల‌క‌ల్లోలం చేసేను. రావ‌ణుడి దేశం అంటే శ్రీ‌లంక‌. ప్ర‌స్తుతం శ్రీ‌లంక దేశంలో అల్ల‌క‌ల్లోలం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. కాశీ ప‌ట్ట‌ణం న‌లభై రోజుల పాటు పాడుబ‌డుతుంది. 1910-12 మ‌ధ్య‌లో గంగాన‌దికి తీవ్రంగా వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో అక్క‌డ క‌ల‌రా వ్యాపించింది. చాలా రోజుల వ‌ర‌కు అక్క‌డికి ఎవ్వ‌రూ వెళ్ల‌లేదు. తాజాగా 2020లో క‌రోనా కార‌ణంగా మ‌రోసారి ఆల‌యం మూసివేశారు. చిత్ర విచిత్ర యంత్రాలు పుడుతుంటాయి. కానీ వీటిలో ఏది కూడా చావును మాత్రం క‌నిపెట్ట‌లేదు.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  అర‌టి పండ్ల‌ను ఎక్కువ‌గా తింటున్నారా..? అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌కుండా పాటించండి..!

సృష్టిని మార్చ‌డానికి ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తారు. మాన‌వ మేథ‌తో సృష్టికి, ప్ర‌తిసృష్టికి చేసి మాన‌వుల‌ను పోలిన రోబోల‌ను త‌యారు చేయ‌గ‌లిగారు. కానీ చావును మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు జ‌యించ‌లేక‌పోయాం. బ్రాహ్మ‌ణులు వారి ధ‌ర్మాల‌ను, పౌరోహిత్యాన్ని వ‌దిలి ఇత‌ర క‌ర్మ‌ల‌ను చేప‌డుతారు. దీంతో అంతా అల్ల‌క‌ల్లోలంగా మారుతుంది. బ్రాహ్మ‌ణులు పౌరోహిత్యం వ‌దిలి వేరే ప‌ని చేసుకుంటారంటే అప్ప‌ట్లో చాలా మంది విడ్డూరంగా చూసేవారు. కానీ ఇప్పుడు అది అక్ష‌ర స‌త్యం అవుతుంది. కేవ‌లం పౌరోహిత్యం చేయాల‌ని కాకుండా వారికి న‌చ్చిన వృత్తిలో వారు స్థిర‌ప‌డుతున్నారు. దేశంలో పెద్ద పొగ మేం క‌మ్ముకుంటుంది. ప్ర‌జ‌లు దాంట్లో చిక్కుకొని మాడిపోతారు. కంచి కామాక్షి దేవ‌త కంటి వెంట నీరు కారుతుంది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత వంద‌లాది మంది మ‌ర‌ణిస్తుంటారు. కృష్ణా, గోదావ‌రి న‌దుల మ‌ధ్య మ‌హాదేవుడు అన్న వాడు జ‌న్మించిన అన్య‌మతాల‌ను స‌మానంగా చూస్తూ.. గుళ్లు, గోపురాలు నిర్మిస్తాడు. పేరు ప్ర‌ఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామదేవ‌త‌లు ఊగిస‌లాడుతారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..?


ఆనంద‌నామ సంవ‌త్స‌రాలు 13 గ‌డిచే వ‌ర‌కు ఈ నిద‌ర్శ‌నాలు క‌నిపిస్తాయి. ప‌తివ్ర‌త‌లు ప‌తిత‌లు అవుతారు. వావివ‌రుస‌లు పాటించ‌రు. ఆచారాలు అన్నీ స‌మ‌సిపోతాయి. విజ‌యవాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ముక్కు ప‌డుక‌ను కృష్ణ‌మ్మ తాకుతుంది. రాజ్య‌మేలిన వారు బిక్షాట‌న‌కు దిగుతారు. బిక్ష‌ట‌న చేసిన వారు ఐశ్వ‌ర్యం పొందుతారు. అడ‌వి మృగాలు ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెల్లో తిరుగుతాయి. ఏనుగు క‌డుపున పంది, పంది క‌డుపున కోతి జ‌న్మిస్తాయి. కొండ‌ల మీద మంట‌లు పుడుతాయి. వెంప‌లి చెట్టుకి నిచ్చెన‌లు వేసే మ‌నుషులు ప‌డుతారు. కృష్ణ‌మ్మ మ‌ధ్య‌లో ర‌థం క‌నిపిస్తుంది. ఆ ర‌థాన్ని చూసిన వారి క‌ళ్లు పోతాయి. ఆకాశ మార్గాన రెండు బంగారు హంస‌లు నేల‌కు చేరి ప‌ట్ట‌ణాల్లో తిరుగుతుంటాయి. వాటిని దురాశ ప‌రులు పట్టుకునేందుకు ప్ర‌య‌త్నించి మ‌ర‌ణిస్తారు.


శ్రీ‌శైలం ప‌ర్వ‌తం పైకి ఓ మొస‌లి వ‌స్తుంది. అది వారం రోజులుండి బ్ర‌మ‌రాంభ గుడిలో చేరి మేక‌పోతులా అరిచి మాయం అవుతుంది. తూర్పు దేశ‌మంతా న‌వ నాగ‌రిక‌త‌తో మెరిసి తిరిగి ధ‌న‌హీనులై ద‌రిద్రులైపోతారు. ఇత్త‌డి బంగారం అవుతుంది. వివాహాల్లో కుల‌గోత్రాల ప‌ట్టింపులు వ‌దిలేస్తారు. ధ‌ర్మ‌బ‌ద్ధంగా వ్యాపారం చేసే వారు క‌నుమ‌రుగైపోతారు. జ‌ల‌ప్ర‌వాహాలు ముంచెత్త‌డం వ‌ల్ల 14 న‌గ‌రాలు మునిగిపోతాయి. నేను రావ‌డానికి ఇదే నిద‌ర్శ‌నం. మీన రాశికి సూర్యుడొచ్చే స‌మ‌యంలో నేను వీర‌భోగ వ‌సంత‌రాయులుగా ఉద్భ‌విస్తాను. నాలుగు మూర‌ల ఖ‌డ్గ‌మును ప‌ట్టి శ్రీ‌శైలం ప‌ర్వతం మీదికి అక్క‌డి ధ‌న‌మంతా పుణ్యాత్ములైన వారికి పంచిపెడ‌తాన‌ని బ్ర‌హ్మంగారు త‌న‌ కాల‌జ్ఞానంలో చెప్పారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  మీరు రాత్రి పూట అన్నం బ‌దులు చ‌పాతీలు తింటున్నారా..? అయితే ఈ విష‌యం త‌ప్ప‌కుండా తెలుసుకోండి..!

Visitors Are Also Reading