బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చాలా విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిలో కొన్ని నిజమయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. దొంగ స్వాములు పుట్టుకు రావడం, ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం, ఆడవాళ్లు మానవ అమ్ముకోవడం, గాంధీలాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా చాలా జరిగాయి. ఇది ఇలా ఉండగా తాజాగా, పవన్ కళ్యాణ్ గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానం లోనే ప్రస్తావించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు, పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందని బ్రహ్మంగారు చెప్పారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
READ ALSO : SS రాజమౌళి అతిధి పాత్రలో కనిపించిన సినిమాలు
Advertisement
“ధరణిలో సిద్ధార్థి సంవత్సరంబున తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చెనయ్య!
రాజవారసత్వము నశించినయ!
ప్రజారాజ్యము విలసిల్లునయా!
తప్పదు నా మాట నమ్మండయా!!”
అని బ్రహ్మంగారు చెప్పారని ట్విట్టర్లో తెగ షేర్ చేస్తున్నారు. దీంతో తెలుగు సంవత్సరాల్లో సిద్ధార్థి ఎప్పుడు వస్తుందోనని జనసైనికులు తెగ వెతికేస్తున్నారు. 1919, 1979, 2029, 2029, 2099 లో సిద్ధార్థి నామ సంవత్సరం వస్తుందని కొందరు వికీపీడియా లింకును షేర్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని, ఒకవేళ కుదరని పక్షంలో 2029లో అధికారం కచ్చితంగా తమదేనని జనసైనికులు బలంగా నమ్ముతున్నారు.
Advertisement
కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పేర్కొంది 2039 కావడంతో ఒకింత నిరాశ చెందుతున్నారు. కాకపోతే, ఇదంతా నిజంగా కాలజ్ఞానంలో ఉందా? లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇది ప్రచారం చేస్తున్నారా? అనే సందేహం సైతం తలెత్తుతోంది. ఇందులో ఉన్న తెలుగు రాష్ట్రము, పవనుడు, ప్రజారాజ్యము అనే మాటలు కల్పితంగానే కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో కూడా చంద్ర దోషము వీడేనయ, అంటూ ‘కాలజ్ఞానా’న్ని వైరల్ చేశారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోను, కరోనా వస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కాగా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేది..కాలమే నిర్ణయించనుంది.
బ్రహ్మంగారి కాలజ్ఞానం
వచ్చేది పవనుడు@Bobbilijsp @satish664422 @UAJanasainyam @SardaarSankar @ pic.twitter.com/9259EdY3W9— Gangadhar sanchana (@gangadhar4466) June 20, 2022
READ ALSO : గుడ్లు, టమాటోలతో కూడా కొడతారు.. రష్మిక పై వస్తున్న ట్రోల్స్ పై సుదీప్