Telugu News » Blog » గుడ్లు, టమాటోలతో కూడా కొడతారు.. రష్మిక పై వస్తున్న ట్రోల్స్ పై సుదీప్

గుడ్లు, టమాటోలతో కూడా కొడతారు.. రష్మిక పై వస్తున్న ట్రోల్స్ పై సుదీప్

by Bunty
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పుష్ప సినిమా ద్వారా నేషనల్ క్రష్ గా మారింది అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె ఈ స్థాయికి రావడానికి అనేక కష్టాలు అనుభవించింది. ఈ విధంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి తన అందాలతో కుర్ర కారుకి చెమటలు పుట్టించే హీరోయిన్ గా మారింది.

Advertisement

Also Read:  బాలయ్య, ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.. చూశారా ? 

కానీ కొన్ని రోజుల నుంచి ఈ సక్సెస్ఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న పై అనేక రకమైన ట్రోల్స్ వస్తున్నాయి. ముందుగా హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా సినిమాపై రష్మిక చేసిన వ్యాఖ్యాలతో కన్నడ అభిమానులు ఫైర్ అయ్యారు. ఇక టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తో లవ్ ట్రాక్ నడిపిస్తోంది అంటూ కూడా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్, రష్మిక మందన్నపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించాడు.

Advertisement

“15-20 ఏళ్ల క్రితం మమ్మల్ని కేవలం న్యూస్ చానల్స్, పేపర్లు మాత్రమే ఇంటర్వ్యూలు చేసేవి. ఆ సమయంలో అవి తప్ప మరేవి కూడా లేవు. కానీ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఉంది. దీనివల్ల చాలా రూమర్స్ వస్తున్నాయి. ఈ ఫేక్ న్యూస్ ను ఎదుర్కోవడం నేర్చుకోవాలి. అలా చేసినప్పుడే మనం ముందుకు సాగుతుంది” అని అన్నారు. అలాగే “సెలబ్రిటీలపై ప్రజలు పూలదండలు వేస్తారు, అలాగే రాళ్లు, గుడ్లు, టమాటాలు కూడా వేస్తారు. వాటిని ఎదుర్కొని మరింత బలంగా మారాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడతాము, ఏమి చెప్పాలి అనే విషయాలలో ముందుగా మనకు ఒక క్లారిటీ ఉండాలి” అంటూ కిచ్చ సుదీప్ ట్రోల్స్ పై వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

READ ALSO : SS రాజమౌళి అతిధి పాత్రలో కనిపించిన సినిమాలు