Home » బాయ్‌ఫ్రెండ్ ఆత్మ‌హ‌త్య‌.. గ‌ర్ల్ ఫ్రెండ్‌కు జైలు శిక్ష‌.. ఎక్క‌డో తెలుసా..?

బాయ్‌ఫ్రెండ్ ఆత్మ‌హ‌త్య‌.. గ‌ర్ల్ ఫ్రెండ్‌కు జైలు శిక్ష‌.. ఎక్క‌డో తెలుసా..?

by Bunty

కొంద‌రూ తమ ప్రేమ కోసం ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌రు. మ‌రికొంద‌రూ ప్రేమ కొద్ది రోజుల పాటు కొన‌సాగించి మ‌ధ్య‌లోనే వ‌దిలేస్తారు. ఈ త‌ర‌హాలోనే రెండేళ్ల క్రితం త‌న బాయ్‌ఫ్రెండ్ ఆత్మ‌హ‌త్య‌కు తానే ప‌రోక్షంగా కార‌ణం అని.. బోస్ట‌న్ క‌ళాశాల మాజీ విద్యార్థిని అంగీక‌రించారు.

ఈ కేసులో 23 ఏండ్ల ఇన్‌యంగ్ యు అనే విద్యార్థినికి రెండున్న‌రేండ్ల పాటు స‌స్పెండెడ్ జైలు శిక్ష ప‌డిన‌ది.
దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ కేసులో ఆమెకు ఎలాంటి ప్రయోజనం అనుమతించబోమని కోర్టు పేర్కొన్న‌ది. ఈ కేసులోని వాస్త‌వాల‌కు సంబంధించినంత వ‌ర‌కు మీడియా ప్ర‌ద్శ‌న‌లు, చ‌ర్చ‌లు, ప్ర‌సారాల ద్వారా ఆమెకు ఎలాంటి ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష స‌హ‌కారం అంద‌కూడ‌దు అని న్యాయ‌మూర్తి రాబ‌ర్ట్ ఉల్మాన్ వ్యాఖ్యానించారు.

2019లో మే 20న మ‌రికొన్ని గంట‌ల్లో గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టా అందుకోవాలె్సిన ఆమె ప్రియుడు.. 22 ఏండ్ల అలెగ్జాండ‌ర్ ఉర్తులా ఒక గ్యారేజ్ నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఉర్తులా పై తిట్ల‌తో విరుచుకుప‌డ్డ ఇన్ యంగ్ ఆయ‌న‌ను చ‌చ్చిపోవాల్సిందిగా కోరిన‌ట్టు ప్రాసిక్యూట‌ర్లు చెప్పారు. ఇది నిజ‌మా.. కాదా అనేది కోర్టు మ‌రొక సారి విచార‌ణ చేప‌ట్టిన త‌రువాత అస‌లు నిజం బ‌య‌ట‌ప‌డ‌నున్న‌ది.

 

Visitors Are Also Reading