Home » మోస‌పోయిన బిగ్ బాస్ బ్యూటీ…డ‌బ్బు, న‌గ‌ల‌తో ప్రియుడు జంప్..!

మోస‌పోయిన బిగ్ బాస్ బ్యూటీ…డ‌బ్బు, న‌గ‌ల‌తో ప్రియుడు జంప్..!

by AJAY
Ad

ప్రియుడు మోసం చేసిందని…ప్రియురాలు మోసం చేసింద‌ని చెబుతూ పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చేవారి గురించి వార్త‌ల్లో త‌ర‌చూ చూస్తూనే ఉంటాం. కాగా తాజాగా ఓ సెల్ర‌బెటీని సైతం ఆమె ప్రియుడు డ‌బ్బు న‌గ‌లు దోచుకుని మోసం చేశాడు. వివ‌రాల్లోకి వెళితే….త‌మిళ బిగ్ బాస్ లో త‌ళుక్కుమ‌న్న న‌టి మ‌రియా జ‌లియానా అలియాస్ జూలీ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. అయితే బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న జూలీ తాజాగా త‌న‌ను ప్రియుడు మోసం చేశాడంటూ అన్నా న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

bigg boss julie

bigg boss julie

జూలీ మ‌నీష్ అనే యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డింది. గ‌త నాలుగేళ్లుగా వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారు. అంతే కాకుండా అప్ప‌టి నుండి వీరిద్దరూ రిలేష‌న్ షిప్ లో ఉన్నారు. ఇక ఇటీవ‌లే ఇద్ద‌రూ పెళ్లి చేసుకుందామ‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు. కానీ అనుకున్న‌ది ఒక్క‌టి అయిన‌ది ఒక్క‌టి అన్న‌ట్టు సీన్ రివ‌ర్స్ అయ్యింది. జూలీ ప్రియుడు మ‌నీష్ ఆమె వ‌ద్ద ఉన్న డ‌బ్బు మ‌రియు న‌గ‌ల‌ను తీసుకుని ఎక్క‌డికో వెళ్లిపోయాడు.

Advertisement

Advertisement

also read : Bigg Boss Telugu 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రంటే..?

అప్పటి నుండి అత‌డి ఆచూకీ కోసం ప్ర‌య‌త్నించింది. కానీ ఆచూకీ ల‌భించ‌లేదు. దాంతో తాను మోస పోయాన‌ని గ్రహించిన జూలీ చివ‌రికి అన్నాన‌గ‌ర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. త‌న ప్రియుడిని ఎలాగైనా ప‌ట్టుకోవాల‌ని అత‌డి వ‌ద్ద నుండి త‌న డ‌బ్బుల‌ను తిరిగి ఇప్పించాల‌ని కోరుతోంది. ఇక బిగ్ బాస్ బ్యూటీ మోస‌పోవ‌డంతో ఆమె అభిమానులు ఆమెను ఓదారుస్తున్నారు. జూలీని మోసం చేసిన వాడిని అరెస్ట్ చేసి క‌ఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Visitors Are Also Reading