Home » Bigg Boss Telugu 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రంటే..?

Bigg Boss Telugu 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రంటే..?

by AJAY
Ad

బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఇక శ్రీరామ్ చంద్ర‌ ఇప్ప‌టికే ఫైన‌లిస్ట్ ల లిస్ట్ లో చేరిపోవ‌డంతో మిగితా ఐదుగురు సిరి,షణ్ణు,స‌న్నీ,మాన‌స్,కాజ‌ల్ లు 14వ వారం నామినేష‌న్ లోకి వ‌చ్చారు. ఇక బిగ్ బాస్ ఫైన‌ల్ కు చేరుకోవ‌డంతో ఈవారం ఇంటి నుండి ఎవ‌రు భ‌య‌క‌ట‌కు వెల‌తారు..? ట‌ప్ 5 లో ఎవ‌రు ఉంటారు..? అన్న‌ది ఇప్పుడు ఎంతో ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఇప్ప‌టికే ఈ విష‌య‌మై స‌ర్వే పోల్స్ కూడా మొద‌ల‌య్యాయి. ఆ స‌ర్వేల ప్ర‌కారం ఇంటిలో ఉండేదెవ‌రు…? భ‌య‌ట‌కు వెళ్లేది ఎవ‌రు అనేది చూద్దాం….సర్వేల ప్ర‌కారం ఎక్కువ ఓట్ల‌తో స‌న్నీ మరియు ష‌ణ్ముక్ లు మొద‌టి స్థానంలో ఉన్నారు. ఆ త‌ర‌వాత ఓటింగ్ ప‌రంగా మాన‌స్ మూడో స్థానం లో ఉన్నాడు.

Advertisement

BIGG BOSS SEASON 5

BIGG BOSS SEASON 5

ఆ త‌ర‌వాత స్థానంలో సిరి ఉంది. దాంతో చివ‌రి స్థానంలో కాజల్ నిలించింది. ఇదే ఓటింగ్ కొన‌సాగిన‌ట్ల‌యితే కాజల్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ ఓటింగ్ లో ఏమైనా మార్పులు జ‌రిగితే సిరికి కూడా ఎలిమినేష‌న్ ముప్పు పొంచి ఉంది. అయితే మాన‌స్ కూడా పెద్ద‌గా ఓటింగ్ శాతం లేదు. దాంతో అత‌డు కూడా డేంజ‌ర్ జోన్ లోనే ఉన్న‌ట్టు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక ఈ వారం శ్రీరామ చంద్ర నామినేష‌న్ నుండి గ‌ట్టెక్క‌డంతో ఆయ‌న అభిమానులు ఎవ‌రికి ఓటేస్తారన్న‌ది కూడా ఆస‌క్తిగా మారింది.

Advertisement

ALSO READ : చైతూతో విడాకుల అనంత‌రం చ‌నిపోతా అనుకున్నా కానీ…మొద‌టి సారి పెద‌వి విప్పిన స‌మంత‌..!

శ్రీరామ్ కు సన్నిహితంగా ఉండేవారు ఎవ‌రైనా నామినేష‌న్లో ఉండి ఉంటే వారికి ఓటు వేసేవారు. కానీ ఇప్ప‌టికే శ్రీరామ్ చంద్ర ఫ్రెండ్స్ అంతా భ‌య‌ట‌కు వెళ్లిపోయారు. దాంతో శ్రీరామ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎవ‌రికి ఓటు వేస్తే వారు ఎలిమినేష‌న్ నుండి సేవ్ అయ్యే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు స‌న్నీకి ష‌ణ్ముక్ కంటే ఓటింగ్ శాతం చాలా ఎక్కువ క‌నిపిస్తోంది. ఈ ఓటింగ్ శాతం ఇలానే కొన‌సాగితే స‌న్నీ ఈ సీజ‌న్ కు విన్న‌ర్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌పడుతున్నారు.

Visitors Are Also Reading