Home » UPSC ఫలితాల్లో వారిద్దరికీ ఒకే ర్యాంక్.. అక్కడ దొరికిపోయారు..!

UPSC ఫలితాల్లో వారిద్దరికీ ఒకే ర్యాంక్.. అక్కడ దొరికిపోయారు..!

by Sravanthi Pandrala Pandrala
Ad

తాజాగా దేశవ్యాప్తంగా యుపిఎస్సి ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో ర్యాంకులు వచ్చిన వారంతా ఆనంద ఉత్సాహాలతో ఉన్నారు. ఈ తరుణంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఏంటో చూద్దామా.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఫాతిమా 23, ఆయేషా మక్రాన్ని 26 యూపీఎస్సీ ఫలితాలలో 184వ ర్యాంకు సాధించారు. వీరిద్దరి రోల్ నెంబర్స్ కూడా ఒకే విధంగా ఉండటంతో గందరగోళం నెలకొంది.

Advertisement

ఈ ర్యాంకు నాదంటే నాదంటూ వారిద్దరూ కలిసి యుపీఎస్సీకీ వారి యొక్క అడ్మిట్ కార్డులను సమర్పించారు. అలాగే స్థానికంగా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదులు చేశారు. ఇద్దరి అడ్మిట్ కార్డులలో చాలా వ్యత్యాసాలు కనిపించాయి. ఇంటర్వ్యూ నిర్వహించిన తేదీ కీలకంగా మారిపోయింది. ఏప్రిల్ 25, 2023న పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించారు. అయితే మక్రాని అడ్మిట్ కార్డులో గురువారం ఉండగా, ఫాతిమా కార్డులో మంగళవారం అని ఉంది.

Advertisement

వాస్తవానికి క్యాలెండర్ ప్రకారం ఆరోజు మంగళవారమే, అయితే ఫాతిమా అడ్మిట్ కార్డు పై యూపీఎస్సీ వాటర్ మార్కుతో పాటు క్యూఆర్ కోడ్ సైతం ఉంది. కానీ మక్రాని అడ్మిట్ కార్డు పై ఇవేవీ లేవు. దీంతో యూపీఎస్సీ అధికారులు కూడా ఫాతిమాని అసలు అభ్యర్థి అని తేల్చారు. మక్రానిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

మరికొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading