భారత టెస్ట్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆ మధ్య చేసిన ఓ ట్వీట్ చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఓ ప్రముఖ జర్నలిస్టు తనను బెదిరిస్తున్నాడని సాహా ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ లను కూడా పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ అప్పట్లో పెద్ద దుమారమే లేపింది.
Advertisement
అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ… ముగ్గురు పెద్దలతో ఓ కమిటీని వేసి ఈ ఘటనలో నిజా నిజాలు తేల్చాలి అని పేర్కొంది. అయితే బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీ కొద్దిరోజుల కిందట తమ నివేదికను సమర్పించగా… తాజాగా బీసీసీఐ ఈ విషయంలో తన తీర్పును వెల్లడించింది. సాహా చెప్పింది నిజమేనని పేర్కొంది.
Advertisement
అయితే మొదట కమిటీకి… సాహా ఆ జర్నలిస్ట్ ఎవరో చెప్పకపోయినా తరువాత అతను బొరియా మజుందార్ అని తెలిపాడు. కానీ మజుందార్ మాత్రం నేను ఆ పని చేయలేదని.. సాహా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రకటించాడు. అటువంటి సమయంలో ఇప్పుడు బీసీసీఐ సాహా చెప్పింది నిజం… తనకు బెదిరింపులు వచ్చాయని స్పష్టం చేసింది. అలాగే దేశం తరఫున ఆడుతున్న ఆటగాడిని ఇంటర్వ్యూ కోసం బెదిరించి నందుకు సదరు జర్నలిస్ట్ మజుందార్ పై రెండు సంవత్సరాలు నిషేధాన్ని విధించింది. అతను ఇండియాలోని ఏ స్టేడియంలోకి రాకూడదని.. అలాగే ఏ ఆటగాడిని కలవకూడదు ఇంటర్వ్యూ చేయకూడదు అని ప్రకటించింది.