Home » రోహిత్ పేరిట చెత్త రికార్డు..!

రోహిత్ పేరిట చెత్త రికార్డు..!

by Azhar
Ad
ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెసఫుల్ కెప్టెన్ ఎవరు అంటే ధోని కన్నా రోహిత్ శర్మ పేరే ఎక్కువ చెబుతారు. ఎందుకంటే ధోని చెన్నైకి నాలుగు ఐపీఎల్ ట్రోఫీలి అందిస్తే.. రోహిత్ శర్మ మాత్రం 5 ట్రోఫీలు అందించాడు. అయితే ఈ ఏడాది ఈ రెండు జట్లు కూడా చాలా చెత్త ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తాయి.
కనీసం చెన్నై 7లో రెండు గెలిస్తే ముంబై ఏడుకి ఏడు ఓడిపోయింది. ఇక ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ ఐపీఎల్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ తమకు ఎంతో ముఖ్యమో తెలిసినా.. రోహిత్ మాత్రం మొదటి ఓవర్లోనే డక్ అవుట్ గా పెవిలియన్ చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ చెత్త రికార్డును కూడా నెలకొల్పాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డక్ అవుట్ అయిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు పీయూష్ చావల్, హర్భజన్ సింగ్, మన్‌దీప్ సింగ్ మరియు పార్థివ్ పటేల్ పేరిట ఉండేది. వీరు మొత్తం 13 సార్లు డక్ అవుట్ అయితే నిన్నటి మ్యాచ్ తో కలిపి రోహిత్ శర్మ 14 సార్లు ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. దాంతో రోహిత్ పై సొసైల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతుంది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading