Home » Mega star:బోలా మేనియా అంటూ “బోలా శంకర్” ఫస్ట్ సాంగ్ రిలీజ్..!

Mega star:బోలా మేనియా అంటూ “బోలా శంకర్” ఫస్ట్ సాంగ్ రిలీజ్..!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆరు పదుల వయస్సులో కూడా అదరగొట్టే స్టైల్ తో, పూర్వకాలం ఎట్రాక్ట్ చేసే డ్యాన్స్ తో కుర్ర హీరోలకు దీటుగా నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన బోలా శంకర్ సినిమాకి సంబంధించి తాజాగా ఒక పాట రిలీజ్ అయింది. పూర్తి వివరాలు ఏంటో చూద్దామా.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్న మూవీ బోలా శంకర్. ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ జూన్ 4వ తేదీ సాయంత్రం రిలీజ్ అయింది.

Advertisement

ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ విడుదల చేశారు. ఈ పాటలో చిరంజీవి బోలా మేనియా అంటూ ఊరిస్తూ చిత్ర యూనిట్ ఎట్టకేలకు మాస్ బీట్ పాటను విడుదల చేసింది. బోలా శంకర్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ మని శర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతమందించారు. ఈ చిత్రానికి మేహర్ రమేష్ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది.

Advertisement

చిరు సోదరి పాత్రను ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ పోషిస్తుంది. వెన్నెల కిషోర్, మురళి వర్మ, సుశాంత్ మరికొందరు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాంబ్రహ్మం సుంకర, కేఎస్ రామారావు, కలిసి నిర్మిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మూవీ వస్తోంది.

మరి కొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading