Home » బ్లూ టీతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే.. మీ రోజువారీ డైట్ లో తప్పకుండా తీసుకుంటారు..!

బ్లూ టీతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే.. మీ రోజువారీ డైట్ లో తప్పకుండా తీసుకుంటారు..!

by Mounika
Ad

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అనేక వ్యాధులు ప్రజలను వెంటాడుతున్నాయి. మారుతున్న జీవనశైలి బట్టి  అధిక బరువు సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు.  ఈ అధిక బరువు కారణంగా చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు అల్లుకుంటున్నాయి. కేవలం పాతికేళ్ల వయసుకే ఈ 40 ఏళ్లు దాటిన వారిలా కనిపిస్తున్నారు. మరి ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలి అంటే ప్రకృతి మనకి ఎన్నో  అద్భుతమైన వనమూలికలను ప్రసాదించింది. వాటిలో శంఖుపూలతో పువ్వులు కూడా ఒకటి.

Advertisement

 ఈ పూలను మనం ఎక్కువగా శివుడి ఆరాధన కోసం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ దీనితో తయారు చేసే టీ వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చాలామందికి తెలియదు.   ఈ శంఖుపూలతో  తయారు చేసే టీనే బ్లూ టీ అని అంటారు. ఈ బ్లూ టీని ఎలా తయారు చేసుకోవాలి దాని వలన కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 ప్రతిరోజు బ్లూ టీని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.  ఈ టీ కోసం శంఖుపూలతో తయారుచేస్తారు. ఈ బ్లూ టీకి కోసం 1 1/4 కప్పు నీరు స్టవ్ పై పెట్టి మరుగుతున్న సమయంలో   6 శంఖు పువ్వులు,  1 అంగుళం అల్లం చిన్న చిన్నగా చేసుకున్న ముక్కలను వేసి బాగా మరిగించాలి. కొంచెం వేడి తగ్గిన తర్వాత 1 టీస్పూన్ తేనె,1 టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి.

 ఇలా తయారైన టీని రోజు తీసుకోవడం వలన  అధిక బరువు నియంత్రణలోకి రావడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలోను,  చర్మం, జుట్టును అందంగా మార్చడంలో సహాయపడుతుంది.  ఈ బ్లూ టీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఆందోళన, డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో ఈ టీ సహాయపడుతుంది. అంతేకాకుండా బ్లూ టీని ప్రతిరోజు తాగడం వలన Curfew నిరోధక శక్తి పెరిగి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు  :

Health tips : చాతిలో మంటను క్షణాల్లో తగ్గించే బెస్ట్ రెమెడీ ఇది..!

ఫుడ్ కోర్ట్స్ ఎప్పుడు టాప్ ఫ్లోర్ లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? అసలు కారణం ఇదే!

Visitors Are Also Reading