తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళలో గన్ పార్క్ వద్ద ఇవాళ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్ రఘునందన్‌రావు నివాళులు అర్పించారు. అనంతరం ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ముగ్గురం ఎమ్మెల్యేలం మాత్రమే ఉన్నాం. కానీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజా సంక్షేమ విధాన పత్రమే గవర్నర్ ప్రసంగం అని చెప్పారు.
దీని మీద చర్చించడం ఎమ్మెల్యేగా మా హక్కు ఉందని, కేసీఆర్ 40 ఏండ్లు వస్తున్న విధానాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని మండిపడ్డారు. గవర్నర్ గారికే దిక్కులేకుండా చేస్తే మా పరిస్థితి ఏమిటో మాకు అర్థం అవుతుందని.. మైకులు కట్ చేసి అవమానిస్తారు. మాట్లాడే అవకాశం ఇస్తారో లేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో గంటల తరబడి మాట్లాడే అవకాశం మాకు ఎప్పుడు దక్కిందని మేము ముగ్గురం కావొచ్చు. కానీ రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని చెప్పారు.
రాష్ట్రంలో నియంతృత్వ, దోపిడీ పాలన కొనసాగుతుందని అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నామని కేసీఆర్ ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించండి. లేదంటే రేపు మీకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
Also Read : 7th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!